లెక్క తేలింది: కేసీఆర్‌ను ఓడించేందుకు టీడీపీ కాంగ్రెస్‌తో కలిసిరావాలన్న రేవంత్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీ కాంగ్రెస్‌తో జతకట్టాల్సిందేనని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ను అడ్డుకోవాలంటే విపక్షాలు ఐక్యతతో వ్యవహరించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిసి వెళితేనే తెలంగాణలో కేసీఆర్‌ను అడ్డుకోవచ్చని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.
నరేంద్ర మోడీకి కేసీఆర్ ఓ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. మోడీని అడ్డుకునేందుకు బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో విపక్షాలు ఎలా అయితే ఏకమయ్యాయో... తెలంగాణలో కూడా అదే మాదిరిగా విపక్షాలు ఏకంకావాల్సిన అవసరం ఉందన్నారు.

ఒకప్పుడు ఎన్టీఆర్ ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టారని అనంతరం ఆయన ప్రదర్శించిన గర్వం ఆయనకు శాపంగా మారి ఆ తర్వాత ఘోర ఓటమి చవిచూశారని గుర్తు చేసిన రేవంత్... కేసీఆర్‌కు కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ చంద్రబాబునాయుడుల మధ్య చర్చలు జరుగుతాయని తాను భావిస్తున్నట్లు రేవంత్ వివరించారు.












Click it and Unblock the Notifications