Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాఠాలు చెప్పాల్సిన పంతులు పాడుపని; గ్రామస్తుల దేహశుద్ధి.. ఆపై

తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. తల్లి, తండ్రి తరువాత గురువుకే అంత గొప్ప స్థానం ఇచ్చింది. అటువంటి గురువులు తమ గురుతరమైన బాధ్యతను మరిచిపోయి పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన పంతుళ్ళు పాడు పనులు చేస్తుంటే, సహించలేక విద్యార్థుల తల్లిదండ్రులు వారికి దేహశుద్ధి చేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారుతున్నాయి.

తాజాగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన బీ మహేందర్ అనే ఉపాధ్యాయుడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. భార్య పిల్లలతో కలిసి దాట్ల గ్రామంలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇక పాఠశాలకు వచ్చే విద్యార్థినులతో మహేందర్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తరచూ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ, వారితో అసభ్యమైన మాటలు మాట్లాడుతూ ఉండడం చేసేవాడు.

teacher sexual assault on students, parents beaten the teacher in mahabubabad district

దీంతో విసిగిపోయిన విద్యార్థినులు మహేందర్ ప్రవర్తనపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు మహేందర్ ఇంటికి వెళ్లి నిలదీశారు. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో స్కూలుకు పంపిస్తుంటే విద్యార్థులతో టీచర్ ఇలా ప్రవర్తించటం ఏంటని సదరు పంతులును పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆపై ఓ విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడు మహేందర్ పై పోక్సో చట్టంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు.

నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట స్కూల్స్ లో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన టీచర్లు దిగజారి, నీచంగా ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి వారు చిన్నారుల భవిష్యత్ ను ఎలా తీర్చి దిద్దుతారు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇలాంటి టీచర్లు సమాజానికి హానికరం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+