బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి అడ్డంగా బుక్ అయిన టీచర్ .. క్రిమినల్ కేసు నమోదు
అన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీశారు. చిలుకూరు ప్రభుత్వ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ సంఘటనతో ఎన్నికల అధికారులు అతను ఓటును రద్దుచేసి, అతనిపై కేసు నమోదు చేయించారు.
వివరాల్లోకి వెళితే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ ను మొబైల్ ఫోన్లో ఫోటో తీశారు ఉపాధ్యాయుడు. జనగామ జిల్లా చిలుకూరు లోని 11 వ నెంబరు పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోడానికి వచ్చిన మనోహర్ అనే ఉపాధ్యాయుడు తన ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో మొబైల్ ఫోన్ తో బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీశారు. అది గమనించిన ప్రిసైడింగ్ అధికారి అనిత అతని నుండి మొబైల్ ఫోన్ ను, బ్యాలెట్ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాక ఫోన్ నుండి బ్యాలెట్ పత్రాన్ని తీసిన ఫోటోలు డిలీట్ చేయడం తో పాటు, అతని ఓటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసిన మనోహర్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications