కేసీఆర్ సర్కార్‌తో మల్లన్న ఢీ-కేసులతో వేధిస్తున్నారని పిటిషన్-ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమన్న హైకోర్టు

ప్రముఖ జర్నలిస్ట్,క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం(అగస్టు 10) విచారణ జరిగింది. తనపై అన్యాయంగా పోలీసులు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని మల్లన్న తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కారణం లేకుండా తనను పోలీస్ స్టేషన్‌కు పిలుస్తున్నారని పేర్కొన్నారు. పదే పదే తనను స్టేషన్‌కు పిలవకుండా ఆన్ లైన్ లోనే దర్యాప్తు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

మల్లన్న కార్యాలయంలో తనిఖీలు...

మల్లన్న కార్యాలయంలో తనిఖీలు...


ఇటీవల హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలోని తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత ఫోటోలను క్యూ న్యూస్‌లో ప్రసారం చేయడమే కాకుండా మరొకరితో తనకు సంబంధం అంటగట్టారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నను ప్రశ్నించేందుకు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో క్యూ న్యూస్‌ ఉద్యోగులతో పాటు మరికొందరు బాధితుల వివరాలు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

కుట్ర అంటున్న మల్లన్న...

కుట్ర అంటున్న మల్లన్న...


క్యూ న్యూస్ కార్యాలయానికి పోలీసులు వెళ్లిన సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మల్లన్న కార్యాలయంపై పోలీసులు దాడులు చేస్తున్నారనే విషయం తెలిసి మల్లన్న మద్దతుదారులు,బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. అనంతరం మల్లన్న కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించారు. మరోవైపు ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేస్తున్న కుట్రలో భాగమేనని మల్లన్న ఆరోపించారు.మల్లన్న కార్యాలయంపై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ఎంపీ ధర్మపురి అరవింద్‌లు తీవ్ర స్థాయిలో ఖండించిన సంగతి తెలిసిందే.

'ప్రశ్నించే గొంతులని అణచివేయడానికి పథకం‌ ప్రకారమే దాడి జరిగింది. అనేక మంది ప్రజాప్రతినిధులు అక్రమాలకు సంబంధించిన ఆధారాలే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆయన తనయుడికి సంబంధించిన అనేక ఆధారాలు క్యూ న్యూస్ అఫీసులో ఉన్నాయి. అందువల్లే పథకం ప్రకారమే దాడి చేసి ఆధారాలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు వస్తే నోటిసు ఇచ్చి చట్టాలకి అనుకూలంగా వ్యవహరించాల్సిన పోలీసులు ముఖ్యమంత్రి డైరెక్షన్ లో బరి తెగించి దాడులు చేయడం దుర్మార్గం.' అని బండి సంజయ్ మండిపడ్డారు.

ధర్మం తమ వైపే ఉందని...

ధర్మం తమ వైపే ఉందని...


ఆ మరుసటిరోజు చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు విచారణ నిమిత్తం మల్లన్న హాజరయ్యారు. ఆ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ... విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు సహకరించినట్లు చెప్పారు. అయితే విచారణ పేరుతో తనను గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించేందుకే ఈ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఉంగరాలు,రంగు రాళ్లు వంటి వాటితో బతుకులు మారుతాయని మోసం చేస్తున్నవారిని ప్రశ్నిస్తే... తన పైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని మల్లన్న ఆరోపించారు.ఎన్ని నిర్బంధాలు చేసినా... ఎన్ని కుట్రలు చేసినా ధర్మం తమ వైపే ఉందన్నారు. ఒక చిన్న కేసుపై ఏసీబీ,ఇతర ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయడం విడ్డూరమన్నారు. తాను జైలుకు వెళ్లడానికి సిద్దమని... భవిష్యత్తులో కేసీఆర్ ఇంతకింత అనుభవించేలా చేస్తామన్నారు.

మల్లన్నపై సంచలన ఆరోపణలు

మల్లన్నపై సంచలన ఆరోపణలు

అంతకుముందు,చిలుకా ప్రవీణ్ అనే జర్నలిస్ట్ మల్లన్నపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌లోనే ప్రవీణ్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. క్యూ న్యూస్‌ను అడ్డుపెట్టుకుని మల్లన్న ఇప్పటివరకూ రూ.200 కోట్లు వరకు వసూలు చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్,కాంగ్రెస్,ఎంపీలు బండి సంజయ్,ధర్మపురి అరవింద్‌ల నుంచి డబ్బులు తీసుకొచ్చుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా మల్లన్న డబ్బులు డిమాండ్ చేశాడని... అయితే మల్లన్న సంగతి తెలిసి ఆమె డబ్బులు ఇవ్వలేదని అన్నారు. భవిష్యత్‌లో మల్లన్న ఆగడాలన్నీ బయటపెడుతామని హెచ్చరించారు.బహుజనవాదం పేరుతో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలను మోసం చేస్తున్నాడని చిలకా ప్రవీణ్ ఆరోపించారు.

కేసీఆర్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని...

కేసీఆర్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని...

క్యూ న్యూస్ బ్లాక్‌మెయిలింగ్‌కు,సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిందని ఆరోపించారు.తీన్మార్ మల్లన్న ఏ నాయకుడి వద్ద ఎన్ని డబ్బులు తీసుకొచ్చుకున్నాడో మొత్తం చిట్టా తన వద్ద ఉందని ప్రవీణ్ అన్నారు. ఇటీవలే పక్క రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రితోనూ డీల్ కుదుర్చుకున్నాడని ఆరోపించారుకేసీఆర్‌ను రోజూ తిడుతాడు కాబట్టి మల్లన్నకు ఆయనతో శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తారని... కానీ అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చుకొన్నాడని ఆరోపించారు.ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తాను ఓడిపోతాననే విషయం ముందే గ్రహించి ప్రత్యర్థి నేతకు వద్దకు వెళ్లి ఓటమిని అంగీకరించాడని... అందుకు గాను రూ.20 కోట్లు తెచ్చుకున్నాడని ఆరోపించారు.

ఈటల రాజీనామాకు మల్లన్నే కారణమని...

ఈటల రాజీనామాకు మల్లన్నే కారణమని...

ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా మల్లన్నే ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే అరెస్ట్ చేయిస్తారంటూ ఈటలను భయపెట్టారని అన్నారు. ఇప్పుడు రాజేందర్ గెలుపు కోసం టెలీకాలర్లతో ఫోన్లు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇందుకోసం భారీగానే డబ్బులు తీసుకున్నాడన్నారు.తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని ప్రవీణ్ స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ మనుషులం కాదు,టీఆర్ఎస్ మనుషులం కాదు మరో పార్టీ మనుషులం కాదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+