విజయారెడ్డి సజీవదహనం, రాజకీయ దుమారం మల్‌రెడ్డి, మంచిరెడ్డిల మధ్య వార్

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహానం రాజకీయా రగడగా మారింది. తహసీల్దార్ చావుకు కారణం నువ్వంటే నువ్వని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. సురేశ్ తండ్రి వద్ద నుండి మల్‌రెడ్డి రంగారెడ్డి భూములు కొన్నారని ఆయన తెలిపారు. భుదందాలు చేస్తుంది మాజీ ఎమ్మెల్యే అంటూ తనపై వచ్చిన ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు.

స్థానిక ఎమ్మెల్యే కారణం అంటూ ఆరోపణలు

స్థానిక ఎమ్మెల్యే కారణం అంటూ ఆరోపణలు

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహానం కేసు రాజకీయరంగు పులుముకుంటుంది. దీంతో ఆమె హత్యకు కారణం నువ్వంటే నువ్వని అధికార ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓవైపు విజయారెడ్డి హత్యకు గల కారణాలను పోలీసులు విచారణ చేస్తుండగా. ఆమె అంత్యక్రియలకు హజరైన ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలు అధికారపార్టీ నేతల ప్రోద్బలంతోనే సురేశ్ తహసీల్దార్‌పై దాడి చేశారని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇందుకు కారణమని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

సురేశ్ కుటుంబం వద్ద భూములు కొనుగోలు చేసింది మల్‌రెడ్డి రంగారెడ్డి

సురేశ్ కుటుంబం వద్ద భూములు కొనుగోలు చేసింది మల్‌రెడ్డి రంగారెడ్డి

అయితే తనపై వచ్చిన ఆరోపణలకు ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందించారు. నిన్న అంత్యక్రియల సంధర్భంగా వారు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టలేడం ఒక ప్రజాప్రతినిధి బాధ్యత కాదని చెప్పిన ఎమ్మెల్యే...సురేష్ తండ్రి కృష్ణయ్య మరియు అతని పెదనాన్న గౌరయ్య వద్ద భూములు కొనుగోలు చేశారని, గత యాబై సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూమిపై ఎవరో ఇద్దరు ముస్లింలను తీసుకువచ్చి కేసులు పెట్టించి రైతుల వద్ద అన్యాయంగా భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. అయితే ఇదే భూములకు సంబంధించి గత సంవత్సంలో రైతులను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరనని అందుకు సంబంంధించిన ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. ఆయనపై మూడు సార్లు ఓడిపోయిన అక్కసుతోనే మల్‌రెడ్డి రంగారెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు.

మొత్తం వ్యవహారంపై విచారణ.. సీఎంకు లేఖ

మొత్తం వ్యవహారంపై విచారణ.. సీఎంకు లేఖ

మరోవైపు గౌరెల్లి గ్రామంలో ఉన్న పలు సర్వే నెంబర్లపై ఉన్న మొత్తం నాలుగువందల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లపై విచారణ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, రాష్ట్ర డీజీపీకి లేఖలు రాస్తానని చెప్పారు. ఇక మల్‌రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు ఎకరాలు ఉన్న ఆయన వందల కోట్ల రూపాయల భూములు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం చెప్పాలని అన్నారు. మరోవైపు ఎలాంటీ విచారణకైనా తాను సిద్దమని పేర్కోన్నారు.

రాజకీయ నాయకుల ఒత్తిడితోనే విజయారెడ్డిపై ఘాతుకం

రాజకీయ నాయకుల ఒత్తిడితోనే విజయారెడ్డిపై ఘాతుకం

అయితే రియల్ వ్యాపారం చేస్తున్న సురేష్ తన కుటుంబానికి చెందిన భూమి పట్టాలు ఇవ్వకపోవడంతో ఆమెపై కక్షను పెంచుకుని పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు. ముఖ్యంగా సురేశ్‌ వద్ద భూములు కొన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారని , ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడికి గురైన సురేష్ తహాసీల్దార్‌‌ను హత్యచేసేందుకు ప్లాన్ వేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అనుకున్నట్టుగానే మొత్తం అయిదు నిమిషాల్లో ఆమెపై పెట్రోలు పోసి నిప్పటించి అనంతరం తాను నిప్పటించుకున్నాడు. తహసిల్దార్ మంటల్లో కాలుతుండగానే ఏసీ పేళుడు జరిగిందని తాపిగా బయటకు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+