తెలంగాణలో నామమాత్రంగా కరోనా కొత్త కేసులు: 25 జిల్లాల్లో సింగిల్ డిజిట్: తగ్గిన టెస్టింగులు

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. కరోనా మరణాలు కూడా పరిమితంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య అయిదుకు మించట్లేదు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ విజృంభణకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేయగలిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఎనిమిది వేలకు దిగువగా నమోదు అయ్యాయి. కొత్త కేసుల నమోదులో వేగం మందగించడం ఊరటనిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గాయి. ఫలితంగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించిందని అంటున్నారు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 384 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 631 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,78,108కు చేరుకుంది. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,69,232 మంది ఉన్నారు. 1,496 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు ఎనిమిది వేలకు దిగువగా నమోదు అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 7,380 యాక్టివ్ కేసులు తెలంగాణలో నమోదు అయ్యాయి.

Telangana: 384 Covid19 positive cases and 3 deaths reported in last 24 hours

గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 5,298 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కొత్తగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ.

జిల్లాలవారీగా ఆదిలాబాద్-6, భద్రాద్రి కొత్తగూడెం-7, జగిత్యాల-8, జనగామ-5, జయశంకర్ భూపాలపల్లి-9, కామారెడ్డి-2, కరీంనగర్-16, ఖమ్మం-13, కొమరంభీమ్ ఆసిఫాబాద్-3, మహబూబ్‌నగర్-5, మహబూబాబాద్-6, మంచిర్యాల-9, మెదక్-5, మేడ్చల్ మల్కాజ్‌గిరి-31, ములుగు-6, నాగర్ కర్నూల్-8, నల్లగొండ-7, నారాయణపేట-2, నిర్మల్-4, నిజామాబాద్-8, పెద్దపల్లి-7, రాజన్న సిరిసిల్ల-8, రంగారెడ్డి-36, సంగారెడ్డి-14, సిద్ధిపేట్-7, సూర్యాపేట్-8, వికారాబాాద్-9, వనపర్తి-1, వరంగల్ రూరల్-7, వరంగల్ అర్బన్-25, యాదాద్రి భువనగిరి-1 కేసులు నమోదు అయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.

తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 28,980 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 61,57,683గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,65,440 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+