హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫలిస్తోన్న కేసీఆర్ సర్కార్ ప్లాన్: తెలంగాణలో రికార్డు స్థాయిలో డిశ్చార్జీలు: 4 లక్షలకు పైగా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్ తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, వ్యూహాలు ఫలిస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలిచాయి. రోజువారీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే పాజిటివ్ కేసుల్లో క్షీణత కనిపించిందనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. యాక్టివ్ కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. తాజాగా బులెటిన్ ప్రకారం 70 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,892 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 46 మరణించారు. 9,122 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,81,640కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 4,05,164 మంది ఉన్నారు. 2,625 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైంది. తాజా బులెటిన్ ప్రకారం.. 73,851 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Telangana: 5892 Covid19 positive cases and and 46 deaths reported in last 24 hours

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కొత్తగా 1,104 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. ఆదిలాబాద్-74, భద్రాద్రి కొత్తగూడెం-97, జగిత్యాల-143, జనగామ-53, జయశంకర్ భూపాలపల్లి-59, జోగుళాంబ గద్వాల-86, కామారెడ్డి-66, కరీంనగర్-263, ఖమ్మం-188, కొమరం భీమ్ ఆసిఫాబాద్-51, మహబూబ్‌నగర్-195, మహబూబాబాద్-129, మంచిర్యాల-143, మెదక్-99, మేడ్చల్ మల్కాజ్‌గిరి-378, ములుగు-35, నాగర్ కర్నూల్-204, నల్లగొండ-323, నారాయణ్‌పేట్-58, నిర్మల్-39, నిజామాబాద్-139, పెద్దపల్లి-137, రాజన్న సిరిసిల్ల-97, రంగారెడ్డి-443, సంగారెడ్డి-193, సిద్ధిపేట్-201, సూర్యాపేట్-89, వికారాబాాద్-148, వనపర్తి-113, వరంగల్ రూరల్-100, వరంగల్ అర్బన్-321, యాదాద్రి భువనగిరి-124 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

Ys Jagan సర్కారుకి హైకోర్టు సూచన, లోపాలు ఉన్నాయ్ చూస్కోండి

తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 76,047 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 55,882 కాగా.. మిగిలినవి ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 1,34,23,123గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 3,60,642 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

English summary
Newly 5,892 Covid-19 Coronavirus Positive cases and 46 deaths have been reported in Telangana in past 24 hours. 9,122 Patients were discharged at the same time. Total positive cases is reached at 4,81,640 and 2,625 deaths were registered in the Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X