వంద కోట్ల అవినీతి తిమింగలం.. ఏసీబీకి చిక్కిందిలా!

తెలంగాణలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్ నాయక్ నివాసాల్లో జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నెలకు దాదాపు రూ.1.25 లక్షల జీతం తీసుకునే ఒక అధికారి, తన సర్వీసులో కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పత్రాల ప్రకారం సుమారు రూ. 12.72 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే వీటి బహిరంగ మార్కెట్ విలువ రూ. 100 కోట్ల పైమాటే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దొరికిన ఆస్తుల చిట్టా ఇదీ:
సోదాల్లో బయటపడిన ఆస్తుల వివరాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సంగారెడ్డి జిల్లాలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, నిజామాబాద్‌లోని 'లహరి ఇంటర్నేషనల్ హోటల్'లో 50 శాతం వాటా, 3000 గజాల భారీ ఫర్నిచర్ షోరూమ్ స్థలం ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. సుమారు 1.004 కిలోల బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ. 1.37 కోట్ల నగదు లభ్యమయ్యాయి. నిజామాబాద్ అశోక టౌన్‌షిప్‌లో రెండు ఫ్లాట్లు, సంగారెడ్డిలో ఒక పాలిహౌస్ ఉన్నట్లు తేలింది. ఇన్నోవా క్రిస్టా, హోండా సిటీ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు తేలింది.

Telangana ACB Busts Transport Officer in Disproportionate Assets Case

'షాడో ఎంపైర్' గుట్టురట్టు
ప్రభుత్వ సర్వీసులో ఉంటూనే హోటళ్లు, షోరూమ్‌లు నిర్వహిస్తూ ఒక 'షాడో సామ్రాజ్యాన్ని' నిర్మించినట్లు కిషన్ నాయక్‌పై ఆరోపణలు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(b), 13(2) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఆస్తుల వెనుక ఉన్న అసలైన బినామీలు ఎవరు అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.

మొదటి నుంచే అక్రమాలు
1994లో అసిస్టెంట్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో అడుగుపెట్టిన మూడ్ కిషన్ నాయక్‌పై మొదటి నుంచే ఆరోపణలున్నాయి. బోధన్‌లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా, మద్నూర్‌లో చెక్ పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్‌లోనూ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అనంతరం మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవీగా పని చేసి ప్రోమోషన్ పొందిన కిషన్ నాయక్ ఏడాది క్రితమే మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్‌గా వెళ్లారు. ఆయన మొదట్నుంచే ఆస్తులను కూడబెట్టినట్లు బహిర్గతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+