కామ్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఏం చేస్తోంది?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్వవహారంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్న ఏసీబీ అధికారుల అలికిడి గురువారం ఏమీ కనిపించలేదు. అసలు ఎలాంటి సందడి లేకుండా ఏబీసీ అధికారులు రోజుమొత్తం ఏం చేస్తున్నారు, ఓటుకు నోటు కేసులో ఎలాంటి స్టెప్ వేయబోతున్నారనేది సగటు సామాన్యుడి ప్రశ్న.
గురువారం మొత్తం ఏసీబీ అధికారులు ఆధారాల పరిశీలన, డాక్యుమెంట్ల తయారీలో మునిగిపోయారని తెలుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో ముందుకు ఎలా సాగాలన్న దానిపై కూడా తీవ్ర స్ధాయిలో తలమునకలై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది సాక్ష్యాత్తూ ఒక రాష్ట్రానికి చెందిన సీఎం కావడంతో ఆధారాలన్నీ పక్కాగా సేకరించడంతో పాటు, డాక్యుమెంట్ల తయారీ కూడా పకడ్బందీగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. న్యాయపరమైన అంశాలు, నిందితులకు జారీ చేయాల్సిన నోటీసుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక బుధవారం రికార్డ్ చేసిన టీఆర్ఎస్ నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం శుక్రవారం సాయంత్రంలోగా ఏసీబీకి అందే అవకాశాలున్నాయి. ఈ వాంగ్మూలం అందిన వెంటనే విచారణను మరింతగా వేగ వంతం చేయనున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటు ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు శుక్రవారం సాయంత్రం లోగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సండ్ర వీరయ్యను కూడా విచారిస్తే మరికొన్ని ఆధారాలు ఏసీబీకి లభించే ఆలోచనలో ఉంది.
ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు సేకరించి ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఉంచారు. వాటికి సంబంధించిన నివేదికలు కూడా అందాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తుంటే ఓటుకు నోటు కేసుని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఏసీబీ అధికారులు గురువారం బయటకు వెళ్లకుండా, డాక్యుమెంటేషన్ ప్రక్రియమీదే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు సమాచారం. ఈ కేసులో కీలకంగా మారిన ప్రతి ఒక్కరినీ ఏసీబీ విచారిస్తోంది. బుధవారం విచారణకు హాజరైన వేం నరేందర్ రెడ్డిని సోమవారం మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు ఇప్పటికే చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications