వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీబీ సోషల్ సైట్స్: డిజిటల్ డేటాతో కోర్టుకు సాక్ష్యాలు... ఏకే ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని సామాన్యులకు చేరువ చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు హైదరాబాదులోని ఏసీబీ కార్యాలయంలో తెలంగాణ సైబర్ సెల్‌తో పాటు, ఆ శాఖ వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్‌లతో పాటు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకే ఖాన్ మాట్లాడారు. సైబర్ సెల్ అనేది విచారణలో డిజిటల్ సాక్ష్య సేకరణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

సరికొత్త హార్డువేర్, సాఫ్టువేర్‌ను సమకూర్చుకోవడం ద్వారా భారీగా ఉన్న డిజిటల్ డేటాను విశ్లేషించి నివేదికను తయారు చేసి సాక్ష్యాలుగా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడంలో అధికారులకు ఎంతగానో సహాయపడుతుందని ఏకే ఖాన్ చెప్పారు.

Telangana ACB social media sites launching

మోడీని విమర్శించే స్థాయి కెటిఆర్‌కు లేదు: నాగం

ప్రధాని నరేంద్ర మోడీని విమర్శఇంచే స్థాయి మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు లేదని బిజెపి నేత, తెలంగాణ బచావో వ్యవస్థాపకులు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం అన్నారు. ప్రధాని మోడీకి విదేశాల్లో తిరిగేందుకు సమయం ఉంటుంది కానీ రాష్ట్రాల్లో పర్యటించేందుకు సమయం లేదా అని కెటిఆర్ సోమవారం ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలపై నాగం మండిపడ్డారు. తెలంగాణ పైన మోడీకి ప్రేమ లేదని కెటిఆర్ చెప్పడం సరికాదన్నారు. కెటిఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ప్రధాని మోడీ కృషి వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయం మరవవద్దని హితవు పలికారు.

English summary
Telangana ACB social media sites launching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X