తెలంగాణా రాష్ట్రాన్ని చినజీయర్ పాలిస్తున్నాడు ... కంచె అయిలయ్య సంచలనం

కాంట్రవర్సీ పుస్తకాల రచయిత, కాంట్రవర్సీ వ్యాఖ్యల ప్రొఫెసర్ కంచె అయిలయ్య మరో మారు చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిపై వై ఐ యామ్ నాట్ ఎ హిందు గ్రంథ రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి . హైదరాబాద్‌లో సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించి, దోషులను శిక్షించాలి అనే అశంపై జరిగిన సదస్సులో ప్రసంగించిన కంచె అయిలయ్య కేసీఆర్ పై , అలాగే చినజీయర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Telangana administrator Chinajeeyar .. sensation of Kanche Ilaiah

తెలంగాణ రాష్ట్రాన్ని చినజీయర్ పరిపాలిస్తున్నారని కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్రంలో కులవివక్ష వుందని ఆయన అన్నారు. దళితులు, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇంతవరకు ఏ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదని విమర్శించారు కంచె అయిలయ్య . విగ్రహం కూల్చివేసి ఇన్ని రోజులు గడుస్తున్నా కేసీఆర్ స్పందించకపోవటం హేయమన్నారు . అంబేద్కర్ తో పెట్టుకుని ఎవరూ బాగుపదలేదన్న అయిలయ్య అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చినచోటే తిరిగి ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు. కావాలనే దళితులను, కమ్యూనిస్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+