హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ వైపు వాదన: చంద్రబాబు ఇంటి నిర్మాణం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఇంటి నిర్మాణం విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ ఓ వైపు వాదన వినిపిస్తోంది. నమస్తే తెలంగాణ దినపత్రిక ఈ రకమైన వాదనను ముందుకు తెస్తూ శుక్రవారంనాడు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

నిబంధనలను ఉల్లంఘించడంతో ఆగకుండా అవాస్తవాలతో ఎదురుదాడికి కూడా దిగుతున్నారని వ్యాఖ్యానించింది. నమస్తే తెలంగాణ వాదన సారాంశం ఈ విధంగా ఉంది - హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఆయన నిర్మించుకుంటున్న ఇంటి విషయంలోనూ జరిగింది. ఇంటి అనుమతికోసం ఆయన సమర్పించిన ఇంటి ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ తిరస్కరించింది.

అలాంటపుడు ప్లాన్‌ను సవరించి నిబంధనలు పాటించాలి. అయితే ఆయన చంద్రబాబు కదా. ఎవరినీ లెక్క చేయరు. ఏపీ పోలీసులను పహారా పెట్టి నిర్మా ణం చేసుకుంటూ పోతున్నారు. అంతటితో ఆగకుండా తాను ఏపీ సచివాలయం భవనాలకు ఆస్తిపన్ను చెల్లించనందున తన ఇంటికి అనుమతులు ఇవ్వలేదని ప్రచారం ప్రారంభించారు.

చంద్రబాబు ఇంటి నిర్మాణం

చంద్రబాబు ఇంటి నిర్మాణం

జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, ప్రస్తుతం నగరంలో జీఓ-168కి అనుగుణంగా నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతున్నాయి. దీని ప్రకారం ఇంటి ప్లాటుకు సం బంధించి యాజమాన్య హక్కులు తెలిపే పత్రా లు, ప్లాటు డైమెన్షన్ కాపీ, ఇంటి ప్లాన్‌కాపీతోపాటు అడ్వాన్స్‌గా రూ. 10వేలు ఇంటి అనుమతి ఫీజు చెల్లించాలి.

చంద్రబాబు ఇంటి నిర్మాణం

చంద్రబాబు ఇంటి నిర్మాణం

అలాగే ఈ జీఓ ప్రకారం జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ప్రస్తుతం 10 మీటర్ల ఎత్తువరకే అనుమతులు మంజూరుచేసే వీలుంది. దరఖాస్తు చేసిన నెలరోజుల్లోగా అనుమతి మంజూరు చేయడమో, లేక కారణం పేర్కొంటూ తిరస్కరించడమో చేయాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో తనతోపాటు తన కుమారుడు లోకేష్ పేరుతో ఉన్న రెండు ప్లాట్ల (ప్లాట్ నెం-1309, 1310)లో ఇంటి నిర్మాణం కోసం గతనెల 18వ తేదీన దరఖాస్తుచేశారు. లేఅవుట్‌లో ఒక్కొక్కటి 1100గజాల చొప్పున మొత్తం 2200గజాలు ఉండాలి.

చంద్రబాబు ఇంటి నిర్మాణం

చంద్రబాబు ఇంటి నిర్మాణం

దరఖాస్తు చేసుకున్న ప్లాన్‌లో కేవలం 2073గజాలు మాత్రమే పేర్కొన్నారు. దీనివల్ల అప్రూవ్డ్ లేఅవుట్ (అనుమతించిన లేఅవుట్)కు, వారు సమర్పించిన ప్లాన్‌కు పొంతన కుదరడంలేదు. అలాగే సెల్లార్, జీ+2తోపాటు స్లాబులేకుండా మూడో అంతస్తు (పెద్ద గోడలు, తలుపులు, కిటికీలు) నిర్మిస్తున్నట్లు ప్లాన్‌లో పేర్కొన్నారు. సెల్లార్, జీ+2 వరకైతే 10మీటర్లలోపు ఉండి అనుమతులకు ఇబ్బంది ఉండదు. కానీ ఇందులో రెండో అంతస్తుపై ఎత్తుగా గోడలు నిర్మిస్తున్నందున దాని ఎత్తు 13మీటర్లు దాటుతున్నది.

చంద్రబాబు ఇంటి నిర్మాణం

చంద్రబాబు ఇంటి నిర్మాణం

లోటుపాట్లు సరిచేసుకొని రివైజ్డ్ ప్లాన్ సమర్పించాలని గడువుకన్నా రెండురోజుల ముం దే, అంటే ఈనెల 16వ తేదీన దరఖాస్తును జీహెచ్‌ఎంసీ అధికారులు తిప్పి పంపారు. రీవైజ్డ్ ప్లాన్ సమర్పించి చంద్రబాబు అనుమతులు పొందాల్సి ఉంటుందని వాదిస్తున్నారు.

చంద్రబాబు ఇంటి నిర్మాణం

చంద్రబాబు ఇంటి నిర్మాణం

సవరించిన ప్లాన్ పంపకుండా చంద్రబాబు నెలన్నర క్రితం దరఖాస్తుచేసినా అనుమతివ్వలేదని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అంతేకాకుండా ఏపీ సచివాలయం ఆస్తిపన్ను చెల్లిస్తేనే తన ఇంటికి అనుమతులు మంజూరుచేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు షరతు విధించారని కూడా చెప్పారు.

English summary
According to Namasthe Telangana - Andhra Pradesh CM Nara Chandrababu Naidu is voilating rules in constructing the house in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X