వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు: కీలకంగా ‘నోట్ల రద్దు’

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. సమావేశాలను 20 పనిదినాలపాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాల్‌లో నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. సమావేశాలను 20 పనిదినాలపాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాల్‌లో నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సమావేశాలకు సంబంధించి డిసెంబర్ 30 వరకు అజెండాను ఖరారు చేశారు. తొలిరోజు సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. జనవరిలో మరోసారి వారం పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Telangana assembly to debate demonetization

కాగా, శుక్రవారం(డిసెంబర్ 16) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు, విపక్ష నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్క, కిషన్‌రెడ్డి, అక్బరుద్దీన్‌, సున్నం రాజయ్య, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సభలో వాడీవేడీ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పెద్ద నోట్ల రద్దుకు సానుకూలంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేస్తోంది.

English summary
The Telangana assembly will debate demonetization on Friday, the first day of the winter session of the legislature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X