30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

డిసెంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సింగ్‌కి సభ సంతాపం తెలపనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసనసభ నివాళులర్పించనుంది. ఈ క్రమంలో ఆరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. భారతదేశానికి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఎనలేని సేవలందించారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణలు తీసుకువచ్చారు.

Telangana Assembly special meeting on 30th

మన్మోహన్ సింగ్ పార్థవదేహాన్ని ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, తదితర నేతలు నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. రాహుల్.. మన్మోహన్ పాడెను మోశారు.

కాగా, శనివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో మన్మోహన్ పార్థీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రయాంక, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంత్యక్రియల్లో పాల్గొని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తుది వీడ్కోలు పలికారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ప్రధాని అంత్యక్రియలకు హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్, పలువురు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు, మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని సతీమణి గురుశరణ్ సింగ్, కుటుంబసభ్యులకు బైడెన్ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+