కరోనా కంట్రోల్ లో తెలంగాణా భేష్ ... అందరూ ఫాలో అవ్వాలని కేంద్రమంత్రి కితాబు
తెలంగాణా ప్రభుత్వం కరోనా కంట్రోల్ లో చాలా బాగా పని చేస్తుందని కితాబిచ్చారు కేంద్రమంత్రి హర్షవర్ధన్ . నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కంట్రోల్ కోసం రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్న ఆయన తెలంగాణా ప్రభుత్వ చర్యలను భేష్ అన్నారు.

31కి చేరిన భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య
చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం 60కి పైగా దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశంలోనూ వ్యాపిస్తుంది. భారతదేశంలో వందల సంఖ్యలో కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఇక తాజాగా భారత్‌లో మరో కరోనా కేసు నమోదయింది. ఈరోజు కరోనా వైరస్ పాజిటివ్ గా ఒక వ్యక్తి రిపోర్ట్స్ నిర్ధారించటం తో భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం అతనికి ఢిల్లీలో చికిత్స అందిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్
ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అన్ని రాష్ట్రాల మంత్రులతో సమావేశంలో చర్చించారు . ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణా రాష్ట్రం కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కొనియాడారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణా తరహాలో చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్న మంత్రి హర్షవర్ధన్
కరోనా వైరస్‌ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్. కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణాలతో తెలంగాణా రాష్ట్రంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Recommended Video


కరోనా రాకుండా తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శభాష్ అన్న కేంద్రమంత్రి
కరోనా వ్యాప్తి చెందకుండా తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శభాష్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి, నమోదైన కేసులు... తదితర అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి, అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ కోవిడ్-19ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణాను అనుసరించాలని హర్షవర్ధన్ సూచించారు. కరోనా వైరస్ విషయంలో ఎన్-95 మాస్క్‌లను అందించాలని, మరో కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి ఈటెల రాజేందర్ .
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications