'వాజపేయి వల్ల నాలాంటి వాళ్లు రాజకీయాల్లోకి'
హైదరాబాద్: అటల్ బిహారీ వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీని పైన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు బుధవారం స్పందించారు. వాజపేయి, మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడం హర్షణీయమన్నారు.
అందుకు తెలంగాణ ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. భారత్, పాకిస్తాన్ మిత్రత్వానికి వాజపేయి ఎంతగానే కృషి చేశారని చెప్పారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం కోసం మదన్ మోహన్ మాలవ్యా శ్రమదానం చేశారని చెప్పారు.

కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాలవ్యా గొప్ప సంస్కర్త, విద్యావేత్త అన్నారు. మహోన్నత వ్యక్తిత్వం కల వాజపేయి వల్ల తన లాంటి వారు ఎందరో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications