వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం బాహాటంగా కొనసాగుతున్న నేపథ్యంలో నేడు తెలంగాణా బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంలో ఏం మాట్లాడతారు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

|
Google Oneindia TeluguNews

నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక పద్దును, ప్రణాళికను సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా ప్రసంగం చేయనున్నారు. దీంతో గవర్నర్ ప్రసంగంపై అన్ని రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోను ఆసక్తి నెలకొంది.

గవర్నర్ వర్సెస్ తెలంగాణా ప్రభుత్వం

గవర్నర్ వర్సెస్ తెలంగాణా ప్రభుత్వం

గతేడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను కొనసాగించారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం బాహాటంగా కొనసాగుతున్న నేపథ్యంలో నేడు గవర్నర్ ప్రసంగంలో ఏం మాట్లాడతారు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇప్పటికే ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బి ఆర్ ఎస్ మంత్రులు, నేతలు గవర్నర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అసెంబ్లీకి నేడు గవర్నర్.. ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి

అసెంబ్లీకి నేడు గవర్నర్.. ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి

ఇక ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ఏం మాట్లాడబోతున్నారు? గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలు ఉంటాయి? తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ మాట్లాడతారా? ప్రభుత్వం పంపిన ప్రసంగంలో ఏ అంశాలు ఉన్నాయి? అనే ప్రశ్నలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత రాజ్ భవన్ , తెలంగాణ ప్రభుత్వం మధ్య సంబంధాలు మెరుగుపడతాయా? లేదంటే మళ్లీ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకునే పరిస్థితులు వస్తాయా? అన్నది కూడా ప్రస్తుతం అందరూ చర్చిస్తున్నారు.

గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం

గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం

ఇక ఈరోజు శాసనసభకు గవర్నర్ రానున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక వాహనశ్రేణి ముందుకు కదులుతుండగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శాసనసభకు చేరుకుంటారు. శాసనసభలో మధ్యాహ్న సమయంలో ఉభయసభల సభ్యులను ఉద్దేశించే గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు.

నిన్న మొన్నటి వరకు ప్రోటోకాల్ పాటించలేదని రకరకాలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తమిళిసై ఈరోజు శాసనసభ వేదికగాను మళ్లీ తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది.

బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ లేకుండానే ప్లాన్ చేసిన తెలంగాణా ప్రభుత్వం.. కానీ చివరికిలా

బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ లేకుండానే ప్లాన్ చేసిన తెలంగాణా ప్రభుత్వం.. కానీ చివరికిలా

మొదట బడ్జెట్ సమావేశాలకు ఆమోదముద్ర వేయాలని గవర్నర్ కు ఫైల్ పంపిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలియజేయకపోవడంతో, గవర్నర్ పై కోర్టు మెట్లు ఎక్కాలని మొదట నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆపై మళ్లీ గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించి సమావేశాలకు ఆమోదం పొందింది. ఇక ఈ నేపథ్యంలో నేటి నుండి కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలతో , అందులోనూ గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రసంగం చేయనుండడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది.

English summary
Telangana budget meetings will start from today. But everyone's excitement continues over Governor Tamili Sai's speech. It will be interesting to see what will be said in her speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X