నేడు తెలంగాణ కేబినెట్.. గోశాల పాలసీపై నిర్ణయం !
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈరోజు సచివాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ముఖ్యంగా గోశాల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అలాగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లుకు సంబంధించి మంత్రివర్గం చర్చించనుంది. అదేవిధంగా ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపైనా కేబినెట్‌లో చర్చ జరగబోతోంది.

కులగణన ప్రక్రియపై మంత్రివర్గం సమీక్షించనుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వల పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చ జరగనుంది. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైనా చర్చించే అవకాశం ఉంది.
అలానే రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా మత్స్యకార సహకార సంఘాల ఇన్‌ఛార్జ్‌ల నియామకంపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది..












Click it and Unblock the Notifications