ఉద్యోగుల బకాయిల విడుదల - కుల గణన షెడ్యూల్..!!
తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న బకాయిల విడుదల పైన నేటి సమావేశం లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా జీవో నెంబర్ 317, బీసీ కులగణన షెడ్యూల్ ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ధాన్యం కొనుగోళ్ల గురించి నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఇక..మూసీ వివాదం పైన మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
కీలక నిర్ణయాల దిశగా
ఈ మధ్నాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆర్వోఆర్ బిల్లు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎకో టూరిజం పాలసీ, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లు, భూ కేటాయింపులతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. ఈ అంశంలో మంత్రివర్గ ఉప సంఘం స్పౌస్, అనారోగ్యం, వితంతువుల కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని జీవో 317 బాధితులను బదిలీ చేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

ఉద్యోగులకు డీఏ విడుదల
ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న అయిదు డీఏల్లో రెండు విడుదల చేసేలా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ధాన్యం సేకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. మిల్లింగ్ ఛార్జీల పెంపు, బ్యాంకు గ్యారంటీలు, తేమ ధాన్యం కొనుగోళ్లు, డీఫాల్టర్లపై చర్యలు సహా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్ పేరు ఇక నుంచి భూమాతగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామానికో రెవిన్యూ అధికారి పైన నిర్ణయానికి చాన్స్ ఉంది. త్వరలో రాష్ట్రంలో జరిగే బీసీ కుల గణన షెడ్యూల్ ను ఈ మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఎకో టూరిజం పాలసీ పైన చర్చ చేయనున్నారు.
మూసీ పై ప్రత్యేక చర్చ
మూసీ నిర్వాసితులకు పునరావాసం, ఆర్థిక సాయం, 5 కంపెనీల కన్సార్టియం తయారు చేసే డీపీఆర్, మంత్రుల సియోల్ పర్యటనపై చర్చ జరగనుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో సిబ్బంది కేటాయింపు, నిధులు, విధులు, పరికరాల కొనుగోలు అంశాలపై కేబినెట్ దృష్టి సారించనుంది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కేంద్రం నుంచి అందాల్సిన వరద సాయం, ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెంచుకునే మార్గాలు సహా వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. మూసీ పైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల దిశగా ఈ సమావేశంలో నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications