పెంపుడు కుక్కతో సచివాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాదికారులు సెలవు రోజున ఆఫీసుకు రావడంలో కొత్తదనం ఏమీ లేదు. అయితే తన పెంపుడు కుక్కతో కలిసి కార్యాలయానికి రావడం సంచలనానికి కారణమైంది.ఈ ఘటనను చిత్రీకరించిన మీడియా ప్రతినిధులపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో శనివారం ప్రభుత్వాధికారులకు సెలవు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ పి సింగ్ మధ్యాహ్నం పూట సచివాలయానికి వచ్చారు.

ఎస్ పి సింగ్ తనతోపాటుగా మరో కారులో ఇద్దరు వ్యక్తులు సచివాలయానికి వచ్చారు. రెండో కారులో సిఎస్ పనిమనుషులతో పాటు ఆయన పెంపుడు కుక్క కూడ కారులో ఉంది.
తన పనిమనుషులతో పాటుగా సచివాలయంలోకి వెళ్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. దీంతో సిఎస్ ఎస్పీ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయారు.












Click it and Unblock the Notifications