హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్.. ఆర్థిక సంక్షోభం గట్టెక్కాలంటే అదే మార్గం.. :కేసీఆర్ ప్రెస్‌మీట్ హైలైట్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో లాక్ డౌన్ పీరియడ్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు లాక్ డౌన్‌ను నిబద్దతతో పాటించినందువల్లే దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని.. తెలంగాణ ప్రజలు మరికొద్దిరోజులు కూడా ఇదే నిబద్దతను పాటించాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్,జపాన్‌ వంటి దేశాల్లో వైరస్ నియంత్రణలోకి వచ్చిందని లాక్ డౌన్ ఎత్తేశారని.. కానీ వైరస్ మళ్లీ పుంజుకోవడంతో మరోసారి లాక్ డౌన్ విధించక తప్పలేదని గుర్తుచేశారు. కాబట్టి లాక్ డౌన్‌‌ను పొడగించాలని నిర్ణయించుకున్నామని.. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఏకాభిప్రాయం వచ్చిందని స్పష్టం చేశారు. ఒకరిద్దరు ముఖ్యమంత్రులు సడలించాలని అభిప్రాయపడినప్పటికీ.. అంతిమంగా కొనసాగించాలనే నిర్ణయమే వచ్చిందన్నారు.

Recommended Video

Telangana Lockdown Extension Till April 30th, Consequences
రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

చివరిసారి ప్రెస్‌మీట్‌లో చెప్పినట్టుగా విదేశాల నుంచి వచ్చిన 34 మంది ,వారి ద్వారా వైరస్ సంక్రమించిన వారందరూ డిశ్చార్జి అయినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం 25937 మందిని వివిధపద్దతుల్లో క్వారెంటైన్‌లో ఉంచామని.. తాజాగా వాళ్లంతా డిశ్చార్జి అయినట్టు తెలిపారు. ఇక పాతవి,కొత్తవి అన్నీ కలుపుకుని ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 96 మంది కోలుకుని డిశ్చార్జి అవగా.. 14 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 393 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిజాముద్దీన్ ఘటన తర్వాత మర్కజ్‌కి వెళ్లి వచ్చినవారిని... వారి క్లోజ్ కాంటాక్ట్స్‌ను గుర్తించి క్వారెంటైన్‌లో ఉంచామన్నారు. అంతా కలిపి ప్రస్తుతం 1654 మంది క్వారెంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. వీరంతా కోలుకుంటే ఏప్రిల్ 24 వరకు డిశ్చార్జి అవుతారని తెలిపారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు క్వారెంటైన్‌లో ఉన్నవారెవరికీ విషమ పరిస్థితి లేదన్నారు. ఏ ఒక్కరికీ ఆక్సిజన్,వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి లేదన్నారు.ఇప్పటికైతే కొత్త కేసుల సంఖ్య కొంత తగ్గిందని.. వైరస్ సంక్రమణ ఆగిపోతే... తదనంతరం కొత్త ఉత్పాతమేమీ రాకపోతే తెలంగాణ దీని నుంచి బయటపడుతుందన్నారు. లాక్ డౌన్ పొడగింపుతో పాటు మరికొన్ని కేబినెట్ నిర్ణయాలను కేంద్రానికి పంపిస్తున్నట్టు తెలిపారు.

కంటైన్‌మెంట్ చర్యలు..

కంటైన్‌మెంట్ చర్యలు..

రాష్ట్రంలో 243 చోట్ల కంటైన్‌మెంట్ ప్రాంతాలను గుర్తించి కఠిన చర్యలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123,ఇతర పట్టణాలు,నగరాల్లో 120 కంటైన్‌మెంట్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆ ప్రాంతాల్లో అందరిని ఇళ్లకే పరిమితం చేశామని.. కంటైన్‌మెంట్ చర్యల్లో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఈ ఒక్కరోజే 11 మంది మృతి చెందారని... రాజస్తాన్‌లో 117 మందికి వైరస్ సోకిందని తెలిపారు. మహారాష్ట్రతో మనకున్న సుదీర్ఘ సరిహద్దు రీత్యా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే పరిస్థితుల రీత్యా మరో రెండు,మూడు రోజుల్లో సరిహద్దులను పూర్తిగా మూసివేయడానికి కూడా వెనుకాడమన్నారు. కుల,మత,వర్గాలకు అతీతంగా లాక్ డౌన్ పొడగింపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పరీక్షలు.. రైతుల సమస్యలపై...

పరీక్షలు.. రైతుల సమస్యలపై...

తెలంగాణలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పదో తరగతి విషయంపై తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
ఇక తెలంగాణలో ఈ ఏడాది అత్యధికంగా రబీ క్రాప్ వచ్చిందన్నారు. ఇంకా కొంత పంట కోత ఉండటంతో... ఏప్రిల్ 15 వరకు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు,లిఫ్ట్ ఇరిగేషన్‌ల ద్వారా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయాన్ని నరేగాకు అనుసంధానించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. కూలీల ఖర్చుల్లో 50శాతం నిధులను కేంద్రం భరించాలని 50శాతం రైతులు భరిస్తారని చెప్పారు. ఇక ధాన్యం నిల్వలు ఎఫ్‌సీఐకి వచ్చే క్రమంలో ఐదారు మాసాలు పడుతుంది కాబట్టి.. దానిపై వడ్డీలు మాఫీ చేయాలని కోరినట్టు తెలిపారు.ఇక వ్యవసాయ రంగానికి లాక్ డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఇప్పటివరకు భారత్ ఆహార పదార్థాల విషయంలో స్వయం స్వావలంబనతో ఉందని.. ఇకముందు కూడా ఆ శక్తిని నిలుపుకోవాలంటే వ్యవసాయ రంగాన్ని మినహాయించాలని చెప్పినట్టు పేర్కొన్నారు. భారత్ లాంటి 130కోట్ల జనాభా కలిగిన దేశానికి తిండి పెట్టే శక్తి ఏ దేశానికి ఉండదని గుర్తుచేశారు.

క్యూఈ విధానం.. ఆర్థిక సంక్షోభం గట్టెక్కాలంటే అదే మార్గం..

క్యూఈ విధానం.. ఆర్థిక సంక్షోభం గట్టెక్కాలంటే అదే మార్గం..

ఎఫ్‌బీఆర్ఎం పరిమితిని 5 లేదా 6శాతానికి పొడగించాలని ప్రధానికి సూచన చేసినట్టు తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంక్షోభంలో అమెరికా,జపాన్,చైనా వంటి దేశాలు క్వాంటేటివ్ ఈజింగ్(QE) అనే విధానాన్ని అవలంభిస్తున్నాయని,భారత్ కూడా అదే పంథాను అవలంభించాలని ప్రధానికి సూచించినట్టు తెలిపారు. దీన్నే హెలికాప్టర్ మనీ అని కూడా పిలుస్తారని చెప్పారు. అమెరికాలో అక్కడి అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ 10శాతం మేర అంటే 2 ట్రిలియన్ డాలర్లను ప్రభుత్వాలకు ఇచ్చిందన్నారు. అలాగే బ్రిటన్‌లోనూ 15శాతం క్యూఈని ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో భారత్‌లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ ఇన్‌కమ్ జీరోగా ఉందని.. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ముందుకొచ్చి దేశ జీడీపీలో కొంత మొత్తాన్ని ప్రభుత్వాల ద్వారా మార్కెట్లోకి పంప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంచనా ప్రకారం 203లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఇవ్వాల్సి ఉంటుందని.. అంటే,10లక్షల కోట్లు ప్రభుత్వాల ద్వారా మార్కెట్లోకి పంప్ అవుతాయని.. తద్వారా ఆర్థిక వ్యవస్థ కొంత మేర కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఈ సంక్లిష్ట సమయంలో రాష్ట్రాల అప్పులను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు.

English summary
Telangana Chief Minister KCR announced to extend lock down period till April 30th in the state. He appealed people to co-operate for government latest decision on lock down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X