రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుపై ఆధారాలివే-మోడీ, షా ఏం చెప్తారన్న రేవంత్..!
దేశంలో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ, ఆరెస్సెస్ చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరికొన్ని ఆధారాలు బయటపెట్టారు. ఆరెస్సెస్ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్ల రద్దుకు ఆలోచన చేస్తోందిన్నారు. ఈ మూల సిద్దాంతం అమలు చేసేందుకు వారు ఎన్నుకున్న రాజకీయ కార్యాచరణ బీజేపీ అన్నారు. బీజేపీ సమయం, సందర్భం, అవకాశం రాగానే ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందన్నారు. దీనిపై తాను మాట్లాడాకే దేశ స్ధాయిలో చర్చకు వచ్చిందన్నారు.
రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరిగాక ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందనే బీజేపీ శాయశక్తులా ప్రయత్నం చేస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో హోంశాఖ ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టించిందన్నారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేఆర్ నారాయణణ్ బడ్జెట్ ప్రసంగం సారాంశం, కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్, ఆ తర్వతా కేంద్రం నియమించిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగ మార్పుకు ప్రయత్నించాయన్నారు. 2002లో వారు ఇచ్చిన సూచనలను దాచి రహస్య అజెండాగా మార్చుకుని, 400 సీట్ల మెజార్టీ వస్తే అమలుకు సిద్దమవుతున్నారన్నారు.

దేశంలో రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ ముఖ్యమంత్రిగా తాను నిర్దిష్ట ఆరోపణలు చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. అందుకే సీబీఐ, ఈడీ తరహాలో ఢిల్లీ పోలీసుల్ని తనపై ప్రయోగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం భయపడి వారి ముందు లొంగి పోతానని ఢిల్లీ సుల్తానులు భావిస్తున్నారని విమర్శించారు. ఈ హోదా దళితులు, గిరిజనులుల, బలహీన వర్గాలు ఇచ్చిందే. వారి ప్రయోజనాలు కాపాడేందుకే నేను ఈ హోదా ఉపయోగిస్తానన్నారు.
2000 ఫిబ్రవరి లో బీజేపీ నేతృత్వంలోని వాజ్ పేయ్ ఎన్డీయే ప్రభుత్వం ఉభయసభల్లో అప్పటి రాష్ట్రపతి నారాయణన్ చేసిన ప్రసంగం తర్వాత రాజ్యాంగ మార్పుకు వెంకటాలయ్య కమిషన్ ఏర్పాటు కు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని, 2002లో ఈ కమిషన్ రాజ్యాంగ సవరణకు నివేదిక ఇచ్చిందన్నారు. ఆ నివేదిక ఇప్పుడు అందబాటులో లేదన్నారు. అప్పట్లో షైనింగ్ ఇండియా అంటూ ప్రజల్లోకి వెళ్తే జనం బీజేపీని తిరస్కరించి యూపీఏకు అధికారమిచ్చారన్నారు.
ఆ తర్వాత ఆరెస్సెస్ రెండో సర్ సంఘ్ చాలక్ గోల్వాల్కర్ 1960లో రచించిన రెండు పుస్తకాల్లో దళితులకు సమాన హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలని రాశారని రేవంత్ గుర్తుచేసారు.. దురదృష్టవశాత్తూ అందరికీ రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చిందన్నారు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎన్జీ వైద్య 2015లో ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వూలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అక్కర్లేదన్నారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పదేళ్ల తర్వాత తీసేయాలన్నారు. ఇప్పుడు పదేళ్లు పూర్తయి 2025 వస్తుంది కాబట్టి రిజర్వేషన్లను తీసేయాలన్నది బీజేపీ ఆలోచన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జూబ్లీహిల్స్. Chief Minister Sri Revanth Reddy press meet https://t.co/YU9Oo4BgAJ
— Telangana Congress (@INCTelangana) May 1, 2024
గతంలో బీపీ మండల్ 1990లో మండల్ కమిషన్ పేరు మీద 52 శాతం బీసీ జనాభాకు 27 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తే వీపీ సింగ్ ప్రధానిగా అమలు చేశారని, దీనిపై ఆరెస్సెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం తీసుకొచ్చారన్నారు. కోర్టులకు కూడా వెళ్తే 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం రిజర్వేషన్లను కొనసాగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. అప్పుడే 50 శాతం పరిమితి పెట్టారన్నారు. దాన్ని కూడా సవరించాలంటే బీసీ కులగణన చేసి వారి జనాభా ఎక్కువగా ఉంటే చేయొచ్చని చెప్పారన్నారు. దాని ఆధారంగా ఇప్పుడు తెలంగాణలో కులగణనకు ఆదేశాలిచ్చామన్నారు.
రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుకే బీజేపీ ఈసారి 400 సీట్లు ఎందుకు అడుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్ సభలో 2/3 వంతు మెజార్టీ కోసమే బీజేపీ ఈ వ్యూహం తయారు చేసింది. 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను చీల్చి బీజేపీ తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది. 1825లో ఏర్పాటైన ఆరెస్సెస్ హిందూ దేశం చేయాలని, రిజర్వేషన్ల రద్దును లక్ష్యాలను పెట్టుకుంది. ఉమ్మడి పౌరస్మతితో పాటు ఇతర ఆరెస్సెస్ విధానాల్ని మోడీ అమలు చేశారన్నారు. మిగిలిన వాటి అమలుకే ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. వీటిని ప్రశ్నిస్తే తనపై కేసు పెట్టారన్నారు.
మోడీ కేబినెట్లో గతంలో పనిచేసిన అనంత్ హెగ్దే 2017లో రాజ్యాంగంపై తనకు గౌరవముందని, రానున్న రోజుల్లో అది మారనుందని చెప్పారని రేవంత్ తెలిపారు. అనంతరం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రిజర్వేషన్లు అభివృద్ధిని తెస్తాయా అని ప్రశ్నించారన్నారు. ప్రభుత్వం పదేళ్లకోసారి రిజర్వేషన్లను పెంచుకుంటూ వస్తున్నాయని వ్యతిరేకించారన్నారు. కుల రిజర్వేషన్లు తీసేస్తే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని ఆరెస్సెస్ నేత మన్మోహన్ వైద్య చెప్పారన్నారు. కాబట్టి వెంకటాచలయ్య కమిషన్ ఏర్పాటుపై మోడీ, అమిత్ షా స్పందించాలన్నారు. రిజర్వేషన్ల రద్దుపై సమాధానం చెప్పాలన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications