కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు: కాంగ్రెస్ లో సంక్షోభం.. బీజేపీలో సంబరం!!
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం బీజేపీకి లాభం చేకూరుస్తుందా? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులను బీజేపీ ట్రాప్ చేస్తుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీ వేస్తున్న గాలానికి చిక్కే చేపలు ఎన్ని? కమలం తో టచ్ లోకి వెళ్ళిన హస్తం నేతలు ఎందరు? వంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న వర్గ పోరు కమలనాథులకు కలిసి వస్తుంది అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

తగవులకు నెలవుగా కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ తమను తాము చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని చూపించే ప్రయత్నం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు కాంగ్రెస్ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని రోజురోజుకు అధోగతి పాలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పాత కొత్త నేతల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలు వెరసి కాంగ్రెస్ పార్టీ తగవులకు నెలవుగా మారింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ట్రాప్ చేసే పనిలో బిజెపి
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించి తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్ల వర్గం రోజుకో రకంగా షాక్ ఇస్తుంది. ఇక తాజాగా రేవంత్ రెడ్డి పై యుద్ధం ప్రకటించిన సీనియర్లు భట్టి విక్రమార్క ఇంట్లో చర్చలు జరుపుతూ బాహాటంగానే రేవంత్ ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తో కూడా తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. ఇక ఈ పరిణామాలు బీజేపీకి బాగా కలిసి వస్తున్నాయి. పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను బిజెపి ట్రాప్ చేసే పనిలో పడింది.

కాంగ్రెస్ నుండి 20 మందికి గాలం వేసిన బీజేపీ
మాజీ మంత్రులు మొదలుకొని, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో పట్టున్న నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి 20 మంది నేతలకు బిజెపి గాలం వేసినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపి వారందరినీ కాషాయ దళం లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు గా కొనసాగి పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్న డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

బీజేపీకి కలిసొస్తున్న కాంగ్రెస్ సంక్షోభం
కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ తదనుగుణంగా అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికలకు ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న బీజేపీ వివిధ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేల ఆధారంగా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న బలమైన నాయకులను, తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెసు సంక్షోభం బిజెపికి బాగా కలిసొస్తుందని చెప్పాలి.

కాంగ్రెస్ నాయకులకు బీజేపీ ఆఫర్.. కానీ కొత్త చిక్కు
అయితే బీజేపీలో వచ్చే ఎన్నికలకు టికెట్ ఇస్తే చేరుతాము అన్నట్టుగా కొందరు సీనియర్ నేతల తీరు ఉంది. కానీ బిజెపి నేతలు ఎవరూ టికెట్ హామీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉండాలా? లేక హామీ ఇవ్వని బిజెపిలోకి చేరాలా? అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ లో తాజా పరిణామాలు బిజెపి సాగిస్తున్న ప్రయత్నాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ క్రమంలోనే బిజెపి వేస్తున్న గాలానికి ఎన్ని చేపలు చిక్కుతాయి అన్న చర్చ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications