రోజా వారి చేపల పులుసు-గతం గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పై జగ్గారెడ్డి సెటైర్లు...!
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికీ, మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా గాంధీనీ టార్గెట్ చేసే క్రమంలో తెలంగాణ సెంటిమెంట్ ను కౌశిక్ రెడ్డి కెలకడంతో ఇప్పుడు అదే హైలెట్ గా మారిపోయింది. దీన్ని చుట్టూ రాజకీయ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు.
రెండు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు అయిపోయిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. పదేళ్లు మీరే అధికారంలో కూడా ఉన్నారని బీఆర్ఎస్ కు గుర్తుచేశారు. ఆంధ్రా ఎమ్మెల్యేల్ని లాక్కుంది కూడా మీరేనన్నారు. వారికి టికెట్లు ఇచ్చేది కూడా మీరే అన్నారు. జగన్ దగ్గరికి పోతారు, రోజా చేపల పులుసు, రొయ్యల పులుసులు తింటారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏందీ పంచాయతీలు అని బీఆర్ఎస్ నేతల్ని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం ఈ 15రోజులు గణేష్ నిమజ్జనంపై దృష్టిపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని, అందుకే కాంగ్రెస్ నేతలంతా మౌనంగా ఉంటున్నారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తల్ని కొందరు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా రేవంత్ రెడ్డిని తమ కార్యకర్తలు వాళ్ల నాలుక కోస్తారని జగ్గారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజల మూడ్ ను ఖరాబ్ చేశారని విమర్శించారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్ట్రబ్ చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications