దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
మంత్రి లక్ష్మారెడ్డి ముమ్మాటికి నకిలీ డాక్టరే అని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లక్ష్మారెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప జడ్చర్ల ప్రజల సమస్యలు పట్టడం లేదని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డి ముమ్మాటికి నకిలీ డాక్టరే అని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లక్ష్మారెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప జడ్చర్ల ప్రజల సమస్యలు పట్టడం లేదని ఆయన విమర్శించారు.
అంతేకాదు, హైదరాబాద్ శివారులో వందల ఎకరాలు కొనేందుకు లక్ష్మారెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ 8,433 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ రూ.1289 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు.

గుజరాత్‌లో 22 ఏళ్లు అధికారంలో లేకపోయినా.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు 80 సీట్లు గెలిపించారని రేవంత్ గుర్తుచేశారు. గుజరాత్ కార్యకర్తలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications