తిరుమలలో తొలి రోజే కౌంటర్లన్నీ ఫుల్..

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 84,198 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,665 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.94 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

Tirumala

తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందజేసే సిఫారసు లేఖలపై శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను కల్పించే విధానం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. తొలి రోజే 550 నుంచి 600 మంది భక్తులు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. సేవల్లో పాల్గొన్నారు.

సాధారణంగా శ్రీవారి దర్శనానికి ఒక్క రోజు ముందు ఇలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరిస్తుంటారనే విషయం తెలిసిందే. అదే విధంగా సోమవారం నాటి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శన భాగ్యాన్నికల్పించడానికి ఆదివారం నాడే వాటిని తీసుకునే ప్రక్రియ చేపట్టారు.

తొలి రోజే భారీ సంఖ్యలో సిఫారసు లేఖలు అందాయి. వీరిలో తెలంగాణ దేవాదాయ శాఖ, రెవెన్యూ, హోమ్ మంత్రిత్వ శాఖల నుంచి అందిన సిఫారసు లేఖలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే- హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో వీఐవీ బ్రేక్ దర్శనాల లేఖలు అందినట్లు చెబుతున్నారు.

Tirumala

ఇదివ‌ర‌కే టీటీడీ ప్ర‌క‌టించిన విధంగా ఈ నెల 30వ తేదీన శ్రీవిశ్వావ‌సు నామ సంవ‌త్స‌ర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని నేడు శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం కార్యక్రమాన్ని చేపట్టారు టీటీడీ పాలక మండలి సభ్యులు, అర్చకులు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దయ్యాయి.

ఫలితంగా- నేటి వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల కోసం సోమవారం నాడు టీటీడీ అధికారులు ఎలాంటి సిఫారసు లేఖ‌లను స్వీకరించ లేదు. అలాగే ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆదివారం ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫారసు లేఖలు ఇకపై శనివారం నాడే వాటిని తమకు అందజేయాల్సి ఉంటుందని టీటీడీ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+