హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓమిక్రాన్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు, ఆందోళన వద్దు: తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల నమోదుపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదని, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాలోనే ఎక్కువగా కేసులు ఉన్నాయని చెప్పారు.

ఓమిక్రాన్ కేసులు లేవు.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు

ఓమిక్రాన్ కేసులు లేవు.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు


ఓమిక్రాన్ కేసులు వెలుగుచూస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారన్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయన్నారు.
విదేశాల నుంచి వచ్చేవారిని మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని డీహెచ్ స్పష్టం చేశారు. పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినవారిని ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు.

ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువే

ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువే

ఓమిక్రాన్ కేసులు గుర్తించిన 12 దేశాల నుంచి 40 మందికిపైగా రాష్ట్రానికి వచ్చారని, వారందరికీ నెగటివ్ రావడంతో హోంక్వారంటైన్ పంపామని తెలిపారు. వారి ఆరోగ్యాన్ని 14 రోజులపాటు పరిశీలిస్తామన్నారు. ఓమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే 6 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారని, కానీ, వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందని డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఎన్ని మ్యూటేషన్లు వచ్చినా కరోనా నిబంధనలను పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చని తెలిపారు.

ప్రపంచాన్ని వణికించింది డెల్టానే.. జాగ్రత్తలు చాలు

ప్రపంచాన్ని వణికించింది డెల్టానే.. జాగ్రత్తలు చాలు


ఒమిక్రాన్‌ వేరియంట్‌ ట్రీట్‌మెంట్‌, ప్రోటోకాల్‌లో తేడా లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో వేరియంట్లు అల్ఫా, బీటా, గామా వేరియంట్‌, డెల్టా వేరియంటట్లు చూశామన్నారు. ఇందులో ప్రపంచాన్ని వణికించింది డెల్టా వేరియంటేనన్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతుంటాయని, ఇప్పటి వరకు మూడు లక్షలకుపైగా మ్యుటేషన్లు కరోనా వైరస్‌లో జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయని, అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కొత్త వేరియంట్‌పై దిశానిర్దేశం చేశారని, సీఎం చైర్మన్‌గా కేబినెట్‌ సబ్‌ కమిటీ కూడా ఏర్పాటైందని పేర్కొన్నారు.

English summary
Telangana DH Srinivasa Rao on Omicron variant cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X