పాఠశాలలకు దసరా సెలవులు ఇలా, కీలక మార్పు - ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..!!
తెలంగాణ విద్యాశాఖ దసరా సెలవుల పైన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజులుగా సెలవుల పైన జరుగుతున్న చర్చ వేళ స్పష్టత ఇచ్చారు. వినాయక నిమజ్జనం వేళ రేపు (శుక్రవారం) పాఠశాలలు.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుగా ఇప్పటికే ఖరారు చేయగా.. తాజాగా దసరా సెలవుల పైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దసరా సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో దసరా సెలవుల పైన స్పష్టత వచ్చింది. ఈ సారి ఏకంగా 13 రోజులు విద్యార్ధులకు సెలవులు రానున్నాయి. వినాయక నిమజ్జనం వేళ రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున ప్రజలు ఇందులో పాల్గొంటారు. దీంతో.. నిమజ్జనం వేళ ప్రభుత్వం సెలవుగా నిర్దారించింది. అదే విధంగా దసరా సెలవుల విషయంలోనూ ఎన్ని రోజులు ఉంటుందనేది కొద్ది రోజులుగా విద్యార్ధులు, పేరెంట్స్ లో చర్చ సాగుతోంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబరు 10 నుండి 22వ తేదీ వరకు మొత్తంగా 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులను ఖరారు చేసినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు
అదే విధంగా అక్టోబర్ 11వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దసరా సెలవులకు ముందస్తుగానే పేరెంట్స్ సొంత ఊళ్లకు.. ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకునేందుకు ఈ సెలవుల పైన స్పష్టత ఇచ్చారు. ఈ 13 రోజుల్లో అక్టోబరు 10న రెండో శనివారం, అలాగే 11, 18 తేదీలు ఆదివారాలు కావడంతో నికరంగా పది రోజులే పనిదినాల సెలవులుగా ఉండనున్నాయి. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని, సమ్మేటివ్ అసెస్మెంట్ (SA-1) పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్య పరిశోధన, శిక్షణ మండలి (SCERT) తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబరు 1వ తేదీన ఎస్ఏ-1 పరీక్షలు ప్రారంభమై, అక్టోబరు 9 నాటికి పూర్తవుతాయి. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు (అక్టోబరు 10) నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. కాగా, అటు ఏపీలో అక్టోబర్ 12 నుంచి దసరా పండుగ సెలవులు మొదలు కానున్నాయి.













Click it and Unblock the Notifications
