తెలంగాణా ఎన్నికలు: వెయ్యి కోట్ల బెట్టింగ్; విచిత్రం ఇదే!!

మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అందరు అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా మేము గెలుస్తాము అని ధీమా వ్యక్తం చెయ్యగల నేత తెలంగాణాలో ఎవరూ కనిపించని పరిస్థితి. ఈసారి ఎన్నికల ఫలితాలు అభ్యర్థుల ఊహకు అందకుండా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ నివేదికలు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరణలతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన ఎన్నికలపై వెయ్యి కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఇక ఈ బెట్టింగ్ ల విషయంలో కూడా ఒక విచిత్రం ఉంది. ఎన్నికలు జరిగిన తెలంగాణలో కంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్ ల జోరు కొనసాగుతుంది.

Telangana Elections: Thousand Crore Betting; This is the interesting fact!!

పోలింగుకు ముందే మొదలైన బెట్టింగ్ రాయళ్ళ హంగామా ఎగ్జిట్ పోల్స్ జోస్యాలతో మరింత జోరుగా కొనసాగుతుంది. ఈసారి కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలతో పాటు, ఈ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ దా, లేక కాంగ్రెస్ దా అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఏపీలో జరుగుతున్న తెలంగాణా ఎన్నికల బెట్టింగ్ మొత్తం సుమారు వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

ఈ ఎన్నికల ఫలితాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపధ్యంలో ఎపీలోనే జోరుగా బెట్టింగ్ లు కొనసాగుతున్నాయని సమాచారం. భీమవరంలో ఈ బెట్టింగ్ లు 300కోట్ల రూపాయలు దాటినట్టు తెలుస్తుంది. ఇక విజయవాడ వంటి నగరాల్లోనూ బెట్టింగులు జోరందుకున్నాయి.

గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తాడా? రేవంత్ రెడ్డి, ఈటల ఎక్కడ గెలుస్తారు? అసలు గెలుస్తారా? కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మల్లారెడ్డి గెలుస్తారా? బర్రెలక్క గెలుస్తుందా లేదా? అంటూ బెట్టింగులు కొనసాగుతున్నాయి .

ఇక జనసేన పోటీలో ఉండటంతో జనసేన పై కూడా బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. జనసేన నేతలు డిపాజిట్ దక్కించుకుంటారా ? లేదా అన్న బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. లక్షకు రెండు లక్షలు, కోటికి రెండు కోట్లు అన్నట్టు సాగుతున్న బెట్టింగ్ లు విస్మయానికి గురి చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+