హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బార్లు, క్లబ్బుల్లో బీర్ల లెక్క తేల్చాలని ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్ కమీషనర్ ... రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూత పడ్డాయి. ఒక్క మద్యం దుకాణాలే కాదు కరోనా లాక్ డౌన్ వల్ల బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు కూడా మూత పడ్డాయి. ఇక మద్యం కోసం మందుబాబులు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే వరకు విలవిలలాడారు . ఇక లాక్ డౌన్ సడలింపుల తర్వాత వైన్స్ తెరుచుకోవతంతో మందుబాబులు లిక్కర్ కోసం ఎగబడ్డారు . తొలి రోజు 110 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగిందంటే ఎంతగా కొనుగోలు చేశారో అర్ధం చేసుకోవచ్చు .

వైన్స్ ముందు కిలోమీటర్ల మేర క్యూ .. తెలంగాణాలోనూ మందుబాబుల మద్యం తిప్పలు షురూవైన్స్ ముందు కిలోమీటర్ల మేర క్యూ .. తెలంగాణాలోనూ మందుబాబుల మద్యం తిప్పలు షురూ

 గతంతో పోలిస్తే వైన్స్ లో బీర్ల విక్రయాలు తగ్గుదల

గతంతో పోలిస్తే వైన్స్ లో బీర్ల విక్రయాలు తగ్గుదల

సమ్మర్ సీజన్ లో ఎక్కువగా మందుబాబులు బీర్లు కొనుగోలు చేస్తారు. లాక్ డౌన్ కి ముందు ఉన్న బీర్లు ఎక్స్పైర్ డేట్ చూసి గడువు ఉన్న వాటినే వైన్స్ లో బీర్లు విక్రయిస్తున్నారు. చాలా వరకు గడువు దాటిపోయిన బీర్లను పారబోసినట్టు సమాచారం . అయినా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బీర్ల విక్రయాలు బాగా తగ్గాయి. మందుబాబులు ఎక్కువగా విస్కీ, వైన్ వంటివి కొనటానికి ఆసక్తి చూపారు . మొత్తానికి తాజాగా లిక్కర్ దొరుకుతున్న నేపధ్యంలో మందుబాబులు సేదతీరుతున్నారు. కానీ ఎక్సైజ్ శాఖ మాత్రం లాక్ డౌన్ సమయంలో షాపులు మూత పడినప్పటికీ , ఇప్పటికీ షాపుల పరిస్థితి లెక్క తెల్హే పనిలో ఉంది. ఆదాయం ఎంత వస్తుంది అన్న అంచనాలలో ఉంది.

బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులపై దృష్టి సారించిన తెలంగాణా ఎక్సైజ్ శాఖ

బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులపై దృష్టి సారించిన తెలంగాణా ఎక్సైజ్ శాఖ

ఇక బార్లు, క్లబ్బులు తెరవకపోవటంతో చాలా మంది బార్లు, క్లబ్బుల్లో తిరిగే జనాలు లిక్కర్ కోసం వైన్స్ కే వెళ్తున్నారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో బెంగళూరు తరహాలో వైన్స్ ముందు అమ్మాయిలు బారులు తీరారంటే బార్లు, క్లబ్బులు లేకపోవటమే కారణం . ఇక బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు ఇంకా తెరుచుకోని కారణంగా వాటిపై దృష్టి సారించింది తెలంగాణా ఎక్సైజ్ శాఖ . ఇక ఈ నేపధ్యంలోనే డీసీలకు తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.బార్లు, క్లబ్‌లు, టూరిజం బార్లలో ఉన్న బీర్ స్టాక్ ఎంత ? అలాగే ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడు ఉంది? లాంటి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని డీసీలను ఆదేశించారు కమిషనర్‌.

Recommended Video

Indian Railways Plan Behind Temporary Running Of Special Trains
 స్టాక్‌పై ఎక్సైజ్‌ శాఖ లెక్క .. ఎక్స్‌పైరీ డేట్ పై ఆరా

స్టాక్‌పై ఎక్సైజ్‌ శాఖ లెక్క .. ఎక్స్‌పైరీ డేట్ పై ఆరా

బీర్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు కాబట్టి వాటి విషయంలో నిర్ణయం తీసుకోవటానికి వృధా కాకుండా చూడటానికి వాటి ఎక్స్‌పైరీ డేట్..? స్టాక్‌పై ఎక్సైజ్‌ శాఖ దృష్టిసారించింది. వైన్స్‌ ఓపెన్ చేయడానికి ముందు వైన్స్ లో ఉన్న స్టాక్‌ లెక్క తేల్చిన అధికారులు ఇప్పుడు బార్లు, క్లబ్‌లలో బీర్ల లెక్క తేలుస్తున్నారు. ఇక తాజా పరిణామాలతో బార్లు, క్లబ్బులకు అనుమతి ఇస్తారా ? లేకా అందులో ఉన్న బీర్లు ఎక్స్పైర్ కాకుండా వినియోగించే ఆలోచన చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
The Telangana excise department is focusing on bars, clubs and tourism clubs that have not been opened yet. Against this backdrop, the Telangana Excise Commissioner has given orders to DCs. What is the stock of beer in bars, clubs and tourism bars? And when is the Expiry date? The Commissioner ordered the DCs to submit the report with full details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X