తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 4356 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో భారీ మొత్తంలో ఖాళీలను భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.
రాష్ట్రంలోని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో.. వాటిలో బోధనా సిబ్బందిని నియమించేందుకు వైద్యారోగ్య సిద్ధమైంది. మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఇలా అన్ని కలిపి 4356 పోస్టులను భర్తీ చేయనున్నారు.

కాంట్రాక్ట్ పద్ధతిన 3155 పోస్టులు, 1201 మందిని గౌరవ వేతనంతో భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి తెలిపారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1459, ట్యూటర్లు 412, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 1201 ఉన్నాయి. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సత్వరమే నియామకాలు చేపట్టాలని ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను ఎస్‌హెచ్‌జీలకు అప్పగింత
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పాఠశాల స్థాయిల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications