గల్లీ నుంచి ఢిల్లీ దాకా సందడి: రేవంత్ రెడ్డికి మరో షాక్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా, పట్టణం నుంచి పల్లె వరకు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

ఆవిర్భావ వేడుకల రోజున సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి ఆయనకు తీరిక లేకుండా పోయింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, టిడిపి, ఇతర పార్టీల నాయకులు వారి వారి పార్టీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు.

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఓయూ జన జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పైన నిప్పులు కురిపించారు. ఓయు విద్యార్థులు గతంలో కేసీఆర్‌కు చెప్పులు చూపించారని, అందుకే కక్ష కట్టారని మండిపడ్డారు.

ఓయులో జనజాతరలో పాల్గొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పైన కేసు నమోదయింది. ఇప్పటికే ఆయన ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓయు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఓయులో విద్యార్థి జేఏసీ నిర్వహించిన జన జాతరకు హైకోర్టు అనుమతి నిరాకరించింది.

హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన విద్యార్థి జేఏసీ నిన్న సాయంత్రం నుంచి రాత్రి దాకా జన జాతరను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకే ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లారు.

దీంతో హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా సంఘాల నేతలు చెరకు సుధాకర్, యెన్నం శ్రీనివాసరెడ్డి, బెల్లయ్య నాయక్, కార్యక్రమ నిర్వాహకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జన జాతరలో పాల్గొన్న తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైన కేసు నమోదయింది. ఓయు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఓయులో విద్యార్థి జేఏసీ నిర్వహించిన జన జాతరకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన విద్యార్థి జేఏసీ నుంచి రాత్రి దాకా జన జాతరను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. వేడుకల్లో పాల్గొన్నవారి దృశ్యం.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. హైదరాబాద్ అంటే గుర్తుకు వచ్చే చార్మినార్ ఫ్లెక్సీ కట్టి వేడుకలు నిర్వహించారు.

బీజేపీ కార్యాలయం

బీజేపీ కార్యాలయం

భాగ్యనగరంలోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకున్నారు.

గాంధీ భవన్

గాంధీ భవన్

భాగ్యనగరంలోని గాంధీ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుంటున్న కాంగ్రెస్ నేతలు.

సీపీఐ కార్యాలయం

సీపీఐ కార్యాలయం

భాగ్యనగరంలోని సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుంటున్న నాయకులు, కార్యకర్తలు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్

భాగ్యనగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుంటున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు.

తెరాస భవన్

తెరాస భవన్

భాగ్యనగరంలోని తెరాస భవన్లో జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుంటున్న తెరాస నాయకులు, కార్యకర్తలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+