తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మరో మండలాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. చారిత్రకంగా పేరున్న ఇనుగుర్తిని మండం చేయాలని కేసీఆర్ నిర్ణయించి ఉత్తర్వులు జారీచేయాలంటూ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం కేసముద్రం మండలంలో భాగంగా ఉన్న ఇనుగుర్తి కొత్త మండలంగా మారబోతోంది. మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం 16 మండలాలున్నాయి.
ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీచేసింది. తాజాగా ఇనుగుర్తి మండల ఏర్పాటుకు ఆదేశాలివ్వడంతో కొత్త మండలాల జాబితాలో మరో మండలం చేరింది. దీంతో కొత్తవి 14 మండలాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 594 మండలాలుండగా.. కొత్తవాటితో కలుపుకొని 608 అయ్యాయి. మండల ఏర్పాటుపై ఇనుగుర్తితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తోంది. ఇనుగుర్తి ఏర్పాటుతో మహబూబాబాద్ జిల్లాలో రెండు మండలాలను ఏర్పాటు చేసినట్లైంది.

రెండురోజుల క్రితం ఏర్పాటు చేసిన 13 మండలాల జాబితా..
నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో సాలూర
మహబూబాబాద్ జిల్లాలో సీరోల్
నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె
వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్.
మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల.
నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్.
సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్.
కామారెడ్డి జిల్లాలోని డోంగ్లి.
జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం












Click it and Unblock the Notifications