TS Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్..!
తెలంగాణలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం రాయితీని ప్రకటించి అమలుచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ట్రాఫిక్ చలాన్లను డిస్కౌంట్ పై చెల్లించేందుకు వాహనదారులు క్యూ కడుతున్నారు. దీంతో భారీ ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలో రాయితీపై చలాన్లు చెల్లించేందుకు గతంలో విధించిన డెడ్ లైన్ ను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను రాయితీపై చెల్లించేందుకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఈ గడువును మరోసారి పొడిగించాలని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాహన చలాన్లను రాయితీపై చెల్లించేందుకు గతంలో ఇచ్చిన గడువును ఫిబ్రవరి 15 వరకూ పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో 15 రోజుల పాటు వాహనదారులు తమ చలాన్లను రాయితీపై క్లియర్ చేసుకోవచ్చు.

పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారులు ఆన్ లైన్ లో చేస్తున్న ప్రయత్నాలకు సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. దీంతో చెల్లింపు కేంద్రాలకు వెళ్లి ఈ చలాన్లను చెల్లించాలంటే వాహనదారులకు సమయం ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొంత గడువు ఇస్తే చెల్లింపులు పూర్తవుతాయని భావిస్తున్నారు. దీంతో రాయితీపై చలాన్లు చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications