తెలంగాణాలో కొత్త సర్వే.. నిరుపేదలకు శుభవార్తనే!
తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చటం లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తాజాగా ఒక కొత్త సర్వే నిర్వహించడం కోసం ప్లాన్ చేస్తుంది. మార్చి నాలుగో వారంలో రాష్ట్రవ్యాప్తంగా పేదల గుడిసెల పైన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
పూరి గుడిసెల సర్వే
ఈ సర్వే ద్వారా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పూరి గుడిసెలు మరియు టార్పాలిన్ లతో ఏర్పాటు చేసుకున్న గుడిసెలను సర్వే చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి నాలుగవ వారంలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఆ నివేదికను తయారుచేసి, నివేదికలో గుర్తించిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.

వారికి ఇందిరమ్మ ఇళ్ళు
ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు మంజూరై కట్టుకోవడానికి ఆసక్తి చూపని వారి అనుమతితో సర్వేలో గుర్తించిన గుడిసె వాసులకు ఆ ఇళ్లను కేటాయించనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నిజం చేయడం కోసం సర్వే ని చేపడుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షల 24 వేల 593 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయ్యాయి.
తెలంగాణాలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వ తోడ్పాటు
2, 63,058 నిర్మాణాలు జరుగుతున్నాయి. నిరుపేదల ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇటుక, ఉక్కు వంటి సామాగ్రిని తక్కువ ధరకే అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరమైన చోట ఇసుక బజార్లను కూడా ఏర్పాటు చేసి 'మన ఇసుక వాహనం' ద్వారా లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించింది.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుకు కసరత్తు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం నాలుగు విడతలలో లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతుంది. ఇదిలా ఉంటే మొదటి విడత ఇళ్ళ నిర్మాణాలు పూర్తవుతున్న క్రమంలో, మళ్లీ రెండవ విడత ఇళ్ల మంజూరుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏప్రిల్ లో రెండవ విడత ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో













Click it and Unblock the Notifications