వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు బిళ్ల ఇస్తే తోలు తీస్తం..! మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ కచ్చా ధమ్కీ.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆడ నొప్పి ఈడ నొప్పంటూ మందులషాపులో మందుబిళ్ల తెచ్చుకోవడంపై తెలంగాణ సర్కార్ కొరడా ఝుళిపిస్తోంది. ఏ మందుబిళ్ల తీసుకోవాలన్నా డాక్టర్ రాసిని చీటి ఉండాలనే ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి శనివారం మధ్యాహ్నం తాజా ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. తలనొప్పి, గొంతులో గరగర, దగ్గు, జ్వరం, జలుబు వంటి వాటికి మాత్ర ఇవ్వయ్యా అంటూ వచ్చే వారికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మొద్దని వార్నింగ్ ఇచ్చింది. చీటి లేకుండా మందులు ఇచ్చే తెలంగాణ మెడికల్ షాపులపై తీవ్రమైన ఆంక్షలు మోపింది సీఎం చంద్రశేఖర్ రావు సర్కార్. మెడికల్ షాప్స్ లో ఇచ్చే మాత్రల వల్ల స్వల్పంగా ఉపశమనం కలుగుతుండడంతో కరోనా పరీక్షలకు కొందరు రావడం లేదన్న ఉద్దేశంతో మెడికల్ షాపులపై ఇలాంటి కఠిన ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.

Telangana Government warning to medical shops..!!

Recommended Video

Son Carries Father On Shoulders After Police Stops Vehicle Amid Lockdown, Video Viral

నగరంలోని మెడికల్ షాపులకు తెలంగాణ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా వచ్చే తలనొప్పి, దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పులకు మందుబిళ్లలు ఇవ్వొదన్ని హుకుం జారీ చేసింది సర్కార్. డాక్టర్ చీటి లేకుండా జ్వరం..దగ్గు..జలుబు మందులు సైతం అమ్మవద్దని హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ మందుల అమ్మకాల్లో భాగమైన తలనొప్పి, దగ్గు టానిక్‌లపై సైతం ఆంక్షలే విధించింది ప్రభుత్వం. కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో తాజా ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎలాంటి దగ్గు, జ్వరం ఉన్నా, వైద్యుల వద్దకు వెళ్ళవలసిన పరిస్థితి తాజా ఆదేశాలతో కలుగుతుంది. వారిని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన మేరకు క్వారెంటైన్ లేదా ఐసొలేషన్ వార్డులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారు. లేదా అవసరమైన మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ పక్కాగా అమలు కావాలంటే నగరంలోని మెడికల్ షాపులను నియంత్రణలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

English summary
CM Chandrasekhar Rao Sarkar has imposed severe restrictions on Telangana medical shops that supply medicines without prescription. The medical shops have been imposing such stringent restrictions that some of the coronary exams are not coming as the pills offered at medical shops are only slightly alleviated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X