25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

జులై 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. కాగా, జులై 25న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (2024-25)ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచించింది.

జులై 25న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్‌ను ఆమోదం తెలపనుంది. ఆదాయ, వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా.. ఎంతమేర ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతమేరకే కేటాయింపులతో రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

Telangana government will present the budget on July 25

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని సూచించినట్లు సమాచారం. గత పదేళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5శాతం వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ. 2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం జులై 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్‌కు నిధుల కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు.

కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలు కలిపి రూ. 60 వేల కోట్లకుపైగానే ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది.

జులై 25న ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

శాసనసభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు వీలైనంత త్వరగా కచ్చితమైన సమగ్ర సమాచారంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు సమన్వయ, సమాచార లోపం లేకుండా సీనియర్ అధికారులు అసెంబ్లీలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+