ఎట్టకేలకు రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్, ఆ రోజునే జమ..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రైతుల ఖాతాల్లో జమ ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నిధుల జమ పైన ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. కావాల్సిన నిధుల సమీకరణకు రంగం సిద్దం అయింది. దీంతో.. రైతులు చాలా రోజులుగా వేచి చూస్తున్న రైతు భరోసా నిధులు ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.

రైతుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు యాసంగి సీజన్‌కు సంబంధించి 'రైతు భరోసా' నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ మేకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రూ.9వేల కోట్ల రుణం కోసం ఇండెంటు పెట్టింది. ఇందులో.. 13 ఏళ్ల కాల పరిమితితో రూ.2వేల కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో రూ.2వేల కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో రూ.2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో రూ.2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 10న ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశముంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్‌ నుంచి ప్రభుత్వం ఎప్పుడూ రుణాలను సేకరించలేదు. తాజాగా సీఎం రేవంత్ రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్లను పంపిణీ చేస్తామంటూ 'ప్రజా పాలన.. ప్రగతి బాట' కార్యక్రమంలో ప్రకటించారు.

telangana-govt-decided-to-credit-rythu-bharosa-funds-in-farmers-accounts-in-next-week-as-reports

10 లేదా 11న రైతుల ఖాతాల్లో జమ

కాగా, ఇప్పుడు ఈ నిధులను రైతు భరోసా కింద విడుదలకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్‌లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సిద్ధంచేసింది. పదో తేదీన ఆర్బీఐ నుంచి ప్రభుత్వ ఖాతాలోకి నిధులు వచ్చిన వెంటనే.. 11వ తేదీన అర్హులైన వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే రోజున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా, ఆ సమయంలోనే రైతుల ఖాతాల్లో నిధుల జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా.. పోలింగ్ వేళ ఈ నిధులను విడుదల చేసేందుకు రాజకీయంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఈ పథకం ఇప్పటికే అమలు చేస్తున్నది కావటంతో ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో.. పదో తేదీన ప్రభుత్వ ఖాతాల్లోకి నిధులు జమ అయిన వెంటనే.. ఈ రోజు నుంచే రైతుల ఖాతాల్లోకి నిధుల జమ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల కు భరోసా నగదు అందనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+