ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ - షెడ్యూల్, పోస్టులు ఇలా..!!

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5089 పోస్టుల భర్తీకి వీలుగా ఈ నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించిన పోస్టులు..పరీక్ష వివరాలను షెడ్యూల్ లో వెల్లడించారు. పరీక్ష నిర్వహించే కేంద్రాలను ప్రభుత్వం ప్రకటించింది.

పరీక్ష షెడ్యూల్ ఇలా:ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Telangana Govt issues TRT notification to fill 5089 Teacher vacancay posts across the state

అర్హతలు..దరఖాస్తు:మొత్తం 5089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, లాంగ్వేజ్ పండిట్‌ 611, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 164, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2575 చొప్పున పోస్టులు ఉన్నాయి. టీఆర్టీ దరఖాస్తుకు బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొంది. 18-44 లోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తిగా ఆలన్ లైన్ విధానంలోనే దరఖాస్తు విధానం ఉండనుంది.

పరీక్షా విధానం కంప్యూటర్‌ బేస్డ్‌ పద్దతిలో నిర్వహించనున్నారు. ఇందుకు అప్లికేషన్‌ ఫీజు రూ.1000 గా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

Telangana Govt issues TRT notification to fill 5089 Teacher vacancay posts across the state

జిల్లాల వారీగా పోస్టులు:ప్రభుత్వం జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెల్లడించింది. అందులో అత్యధికంగా హైదరాబాదులో 358 ఖాళీలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 275, కొమరం భీమ్ అసిఫాబాద్లో 289, సంగారెడ్డిలో 283, రంగారెడ్డిలో 196, సూర్యాపేటలో 185,వికారాబాద్ లో 191, నల్గొండలో 219, కామారెడ్డిలో 200, అదిలాబాదులో 275, నిజామాబాద్ లో 309, నారాయణపేటలో 154, మెదక్ లో 147, ఖమ్మంలో 195, కామారెడ్డిలో 200 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in ను సంప్రదించాలని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+