కామన్ ఎంట్రెన్స్ టెస్టుల షెడ్యూల్ విడుదల

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.

మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి. మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20న పీఈసెట్. మే 25న లాసెట్, మే 25న పీజీఈసెట్, మే 26న పీజీ లాసెట్, మే 31న ఎడ్‌సెట్ నిర్వహిస్తారు.

Telangana govt released common entrance exams schedule

ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూహెచ్‌కు అప్పగించారు. లాసెట్, పీజీలాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించారు. పీజీసెట్ నిర్వహణ బాధ్యత మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Higher education council has released Common entrance exams schedule today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి