Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూసీ తీరాన మహత్తరం

చారిత్రక మూసీ నది ఒడ్డున ఒక మహత్తర మార్పు రూపుదిద్దుకుంటోంది. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పర్యావరణాన్ని పునరుద్ధరించడమే కాకుండా, దేశ మత వైవిధ్యాన్ని, ఐక్యతను చాటిచెప్పబోతోంది. మూసీ పునరుజ్జీవనం తర్వాత ఆ నదీ పరివాహక ప్రాంతంలో దేవాలయం, మసీదు, గురుద్వారా, చర్చి వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు కొలువుంటాయి. మత సహనం, అన్ని వర్గాల ప్రజల సహజీవనం, పరస్పర గౌరవం, ఉమ్మడి వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

దక్షిణ కాశీ తరహాలో నదీ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంత ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 1,400 సంవత్సరాలకు పైబడిన ఓంకారేశ్వర స్వామి దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మొత్తం ఎనిమిది ఎకరాలలో 700 కోట్ల రూపాయలతో వీటిని అభివృద్ధి చేయనుంది.

Telangana Grand Plan for Shiva Temple Mosque Sikh Shrine and Church on Musi Riverfront Four-Faith

దేవాలయాలతో పాటు మూసీ నదీతీరంలో ఓ మసీదు, గురుద్వారా, చర్చి నిర్మాణానికి ఉద్దేశించిన డిజైన్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని మతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ లో కలిసి మెలిసి జీవిస్తోన్నారని, దీనికి ప్రతీకగా ఆయా ప్రార్థన స్థలాలను నిర్మించాలని సంకల్పించింది. నదీతీరాల వెంబడి గొప్ప నాగరికతలు అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేస్తోంది. వాటి తరహాలోనే మూసీ నదీతీరాన్ని ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా మలచాలని భావిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షించడానికి ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నది పర్యావరణ పునరుద్ధరణ, వరదల నివారణ, పట్టణ పరివర్తన, సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చే క్ర‌మంలో ఈ ప్రాజెక్ట్ ను చేప‌ట్టింది ప్ర‌భుత్వం. దీనికి సంబంధించిన ప‌నులు, ఇత‌ర‌త్రా అంశాల‌ను సమన్వయం చేయడానికి, ఆదేశాల‌ను అమలు చేయడానికి ఈ క‌మిటీ తెర‌మీదికి వ‌చ్చింది.

మూసీ నది సమగ్రాభివృద్ధి, పునర్జీవనం, నిర్వహణ లక్ష్యంగా ఉన్నత స్థాయిలో స్పష్టమైన మార్గదర్శకత్వం, అంతర్-విభాగ సమన్వయం చేసుకోవ‌డం, పనుల పురోగ‌తిని ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తుందీ స‌బ్ క‌మిటీ. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ‌ల మంత్రి డీ శ్రీధర్ బాబు, హైద‌రాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

మూసీ నది అభివృద్ధి సంస్థ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్‌లు, అలాగే హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అవసరాన్ని బట్టి కమిటీ సమావేశాలకు హాజ‌రు కావాల్సి ఉంటుంది. అవసరమని భావిస్తే ఇతర అధికారులను కూడా సమావేశాలకు పిలవొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+