Intermediate Hall Tickets: మొబైల్ కే ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు.. పూర్తి వివరాలివే..
Intermediate Hall Tickets: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్లు రానున్నాయి. గతంలో ఇంటర్మీడియట్ బోర్డు కేవలం కాలేజీలకు మాత్రమే పంపించేది. అనంతరం వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటన వచ్చేది. తెలంగాణ ఇంటర్ బోర్టు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్ కు నేరుగా హాల్ టికెట్ లింక్ ను ఇంటర్ బోర్డు పంపించనుంది. ఆ లింక్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే కాలేజీ సిబ్బందిని అడిగి తెలుసుకోవాలని ఓ అధికారి వెల్లడించారు.
నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నందున ఇప్పటికే హాల్ టికెట్లను పంపించారు. రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ జరగనున్నాయి. త్వరలో రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా పంపనున్నట్లు వెల్లడించారు. విద్యా శాఖ పంపిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్యలు తలెత్తితే కళాశాలకు వచ్చి సమస్యను తెలియజేయాలని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తం ఈ ఏడాది మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. ఈ విధానం వల్ల ప్రైవేట్ కాలేజీలు పరీక్షల సమయాల్లో పెండింగ్ ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడకుండా ఈ విధానం విద్యార్థులకు ఊరట కలిగించనుంది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..
మార్చి 5, 2025- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 7-ఇంగ్లీష్ పేపర్-1
మార్చి 11-మ్యాథ్స్ పేపర్1ఏ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
మార్చి 13-మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజి పేపర్-1, హిస్టరీ పేపర్-1
మార్చి 17- ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 19- కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
మార్చి 21-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
మార్చి 24- మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
మార్చి 6,2025- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మార్చి 10- ఇంగ్లీష్ పేపర్-2
మార్చి 12- మ్యాథ్య్ పేపర్ 2ఏ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
మార్తి 15- మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చి 18-ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 20-కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
మార్చి 22- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు)
మార్చి 25- మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications