Telangana Lok Sabha Election Results 2024 LIVE: ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ రికార్డు విజయం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల 2024 ప్రత్యక్ష ఫలితాలు: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పోటాపోటీగా నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో త్రిముఖ పోటీ కనిపించింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా? అనే విధంగా పోటీ పడితే.. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి.. ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నామమాత్రంగానే పోటీలో నిలిచింది. మే 13న జరిగిన ఓటింగ్ తర్వాత జూన్ 4వ తేదీన 17 ఎంపీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
2019 సంవత్సరంలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో సుమారుగా 66.4 శాతం ఓటింగ్ నమోదైంది. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. ఇక తాజాగా 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4వ దఫా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 66 శాతం ఓటింగ్ నమోదైంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాల: మంత్రి జూపల్లి కృష్ణారావు
మా ఆత్మస్తైర్యాన్ని పెంచాయి: రేవంత్ రెడ్డి

మల్కాజిగిరిలో 3.8 లక్షల ఓట్ల మెజారిటీతో ఈటెల విజయం

కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం.. అధికారికంగా సర్టిఫికెట్ అందజేత

తెలంగాణలో గెలుపుబాటలో ఉన్న బిజెపి 8 స్థానాలు ఇవే..!
పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణకు భారీ మెజారిటీ
















Click it and Unblock the Notifications