Viral Video : బిగ్ ఫ్యాన్ అంటున్న మంత్రి కోమటిరెడ్డి.. మురుసిపోయిన జెనీలియా

స్టార్ బ్యూటీ "జెనీలియా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. "బాయ్స్" సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సిద్దార్ధ్ సరసన నటించిన "బొమ్మ‌రిల్లు" మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలానే ఎన్టీఆర్ తో సాంబ, రామ్ చరణ్ సరసన ఆరెంజ్.. అల్లు అర్జున్ తో హ్యాప్పీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సైతం పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

కాగా బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గానే మళ్లీ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె "మజిలీ" రీమేక్ తో భారీ హిట్ కొట్టి.. తెలుగులో 'జూనియర్' అనే చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అయిన ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే అమీర్ ఖాన్‌ హీరోగా నటించిన 'సితారే జమీన్‌ పర్‌' మూవీలో కీలక పాత్ర పోషించారు.

telangana-minister-komatireddy-venkatareddy-comments-about-genelia-and-video-goes-viral

కాగా రీసెంట్ గానే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇండ‌స్ట్రీకి సంబంధించి ప్ర‌త్యేక ప్రోగ్రాం నిర్వ‌హించారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత‌లు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యాం ప్ర‌సాద్ రెడ్డి పాల్గొన్నారు. అలానే అక్కినేని అమల, రితేశ్ దేశ్‌ముఖ్‌, జెనీలియా, అసిఫ్ అలీ సహా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత బోనీ క‌పూర్ త‌న‌యుడు, హీరో అర్జున్ క‌పూర్ ఈ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

నా ఫేవరెట్ హీరోయిన్..

ఈ క్రమంలోనే మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిమాట్లాడుతూ.. జెనీలియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చేశానని తెలిపారు. 30 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా కానీ.. ఏనాడు జెనీలియా సినిమాలు చూడడం మిస్ చేయ‌లేద‌ని వెల్లడించారు. తన అభిమాన న‌టి జెనీలియా అని ఓపెన్ అయ్యారు. ఆమె నేష‌న‌ల్ యాక్ట‌ర్‌ అని.. న్యాచుర‌ల్ హీరోయిన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆమె రావ‌డం ఎక్స్‌పెక్ట్‌ చేయ‌లేద‌ని అంటూ థ్యాంక్యూ సిస్ట‌ర్ అంటూ కామెంట్స్ చేశారు.

కాగా మంత్రి మాటలకు జెనీలియా హర్షం వ్యక్తం చేస్తూ మురిసిపోయారు. ఆమెతో పాటు భ‌ర్త రితేష్ కూడా న‌వ్వుతూ ఉండగా.. మిగతా వారు సైతం సరదాగా ఉండడం గమనించవచ్చు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+