వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మున్సిపోల్స్‌లో ఘర్షణలు: వీల్‌చైర్‌లో తీసుకొస్తున్నారని టీఆర్ఎస్‌‌పై ఫార్వార్డ్ బ్లాక్ ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది. 120 మున్సిపాలిటీ, 9 కార్పొరేషన్లలో పోలింగ్ ఊపందుకొంది. మంచు వల్ల ఉదయం మందకొడిగా పోలింగ్ జరిగినా.. 9 గంటల తర్వాత ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులుతీరారు. ఐడీ ప్రూఫ్ పరిశీలించి ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. మరొవైపు కొంపల్లి మున్సిపాలిటీలో ఫేస్ రికగ్నేషన్ యాప్ ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో దొంగ ఓట్లు ఉంటే తేలికగా కనిపెట్టే వెసులుబాటు ఉండనుంది.

చెదురుమదురు ఘటనలు

చెదురుమదురు ఘటనలు

మున్సిపల్ ఎన్నికల కోసం 7961 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అయినా గద్వాల, మంథని, మణికొండలో చెదురుమదురు ఘటనలు జరిగాయి. గద్వాల పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. ఎంఐఎం-కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

Recommended Video

Telangana Municipal Elections 2020 : Polling Started Amid Tight Security | రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఐడీ ప్రూఫ్ కోసం..

ఐడీ ప్రూఫ్ కోసం..

నిజాంపేటలో అధికారులు, ఓటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఐడీ ఫ్రూఫ్ చూపిస్తేనే అనుమతిస్తామని అధికారులు అనడంతో వివాదం చెలరేగింది. అయితే ఓటరు ఫోన్‌లో ఐడీఫ్రూప్ చూపించారు.. దానిని తాము పరిగణలోకి తీసుకోమని, ఓటు వేసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఎన్నికల సిబ్బందితో ఓటరు వాగ్వివాదానికి దిగాడు.

 టీఆర్ఎస్ వర్సెస్ ఫార్వార్డ్ బ్లాక్

టీఆర్ఎస్ వర్సెస్ ఫార్వార్డ్ బ్లాక్

మంథని మున్సిపల్ మూడో వార్డులో కూడా గొడవ జరిగింది. ఓటర్లను వీల్‌చైర్లలో తీసుకొచ్చి ఓటేస్తున్నారని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు టీఆర్ఎస్‌పై గొడవకు దిగారు. పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్-ఫార్వార్డ్ బ్లాక్ కార్యకర్తలు గొడవ పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మణికొండలో కూడా..

మణికొండలో కూడా..


ఇటు హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. 17వ వార్డు వద్ద కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది.

English summary
telangana municipal elections Frictions in the various places
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X