తెలంగాణ కొత్త మంత్రుల జాబితా: ఇద్దరు డిప్యూటీ సీఎంలు: హోం, ఫైనాన్స్ వారికే

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలను ఆమె జారీ చేశారు.

Telangana new cabinet: Bhatti Vikramarka and Seethakka likely appointed as deputy CMs

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో- ఇక మంత్రివర్గ కూర్పుపై కసరత్తు సాగుతోంది. మంత్రుల జాబితాతో రేవంత్.. ఢిల్లీ వెళ్లారు. ఈ జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్ద చర్చించాల్సి ఉంది.

పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క, దానసరి అనసూయ అలియాస్ సీతక్క ఉప ముఖ్యమంత్రులుగా అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భట్టి విక్రమార్క‌కు ఆర్థికం, హోం మంత్రిత్వ శాఖను సీతక్కకు అప్పగిస్తారని తెలుస్తోంది. సీతక్కకు హోం శాఖను ఇప్పించాలంటూ రేవంత్ రెడ్డి పట్టుబట్టారని చెబుతున్నారు.

దుద్దిళ్ల శ్రీధర్ బాబును స్పీకర్‌గా అపాయింట్ చేస్తారని సమాచారం. సుదర్శన్ రెడ్డి- వ్యవసాయం, తుమ్మల నాగేశ్వరరావు- రోడ్డు- భవనాలు, దామోదర రాజ నర్సింహ- విద్య, జూపల్లి కృష్ణారావు-పర్యాటకం, ఉత్తమ్ కుమార్ రెడ్డి- పంచాయత్ రాజ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- మున్సిపాలిటీలు, కొండా సురేఖ- మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఇస్తారని చెబుతున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- జలవనరులు, జీ వివేక్- ఎస్సీ సంక్షేమం, మల్‌రెడ్డి రంగారెడ్డి- క్రీడలు, యువజన వ్యవహారాలు, పొన్నం ప్రభాకర్-అటవీ, కే మదన్ మోహన్- ఐటీ, మహ్మద్ షబ్బీర్ అలీ- మైనారిటీ సంక్షేమం, కోదండరామ్‌- ఆరోగ్యం, అద్దంకి దయాకర్‌‌- కార్మిక శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. కోదండరామ్, అద్దంకి దయాకర్‌ను కేబినెట్‌లోకి తీసుకుని, వారికి శాసనమండలికి ఎంపిక చేస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+