సభ అట్టర్ ప్లాఫ్, కెసిఆర్ దీక్ష మర్మం తెలుసు: ఉత్తమ్, జైపాల్‌కు కడియం కౌంటర్

వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు బుధవారం నాడు మండిపడ్డారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. వరంగల్‌లో కెసిఆర్ హాజరైన టిఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ప్లాఫ్ అన్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ లోకసభ ప్రజలు కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపిస్తే కెసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. నిన్నటి సభలో కెసిఆర్ నుంచి విమర్సలు తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్నారు.

రైతులను ఆదుకోకుండా కేంద్రంతో పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ ఏమిటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వాగ్ధానాలను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ నేతలు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తన వల్లనే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ అనుకోవడం తప్పని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఎలా దీక్ష చేశారో, ఎలా విరమించారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. తాము రాజీనామా చేసి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. అసత్యాలు, అబద్దాలతో అధికారంలోకి వచ్చారన్నారు.

Telangana people know about KCR's deeksha: Congress

కెసిఆర్ హైదరాబాదులో అలిగి కూర్చుంటే తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే కెసిఆర్‌ను తామే కోరామన్నారు. కెసిఆర్‌కు చెప్పవలసింది చాలా ఉందని, కానీ మా స్థాయి అది కాదన్నారు. ప్రజా సంఘాల ఒత్తిడి మేరకే భయపడి కెసిఆర్ తిరిగి నాడు దీక్షను ప్రారంభించారని ధ్వజమెత్తారు.

తన వల్లే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ అనుకోవడం తప్పు, టి కోసం కెసిఆర్ ఎలా దీక్ష చేశారోత ఎలా విరమించారో అందరికీ తెలుసు, మేం రాజీనామా చేసి ంే తెలంగాణ వచచేది కాదు, హైదరాబాదులో అలిగి కూర్చుంతే తెలంగాణ రాలేదు, కాంగ్రెస్ లే చేరాలని నేనే కోరా, కెసిఆర్ కు చెప్పాల్సింది చాలా ఉంది గకానీ మా స్థాయి కాదు,

జైపాల్ రెడ్డి ఉద్యమంలో ఎక్కడ: కడియం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. పోలింగ్ శాతంను బట్టి తమ పార్టీ అభ్యర్థి మెజార్టీ తేలుతుందని ఆయన అన్నారు.

ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పాలనపై రెఫరెండమేనని కడియం వ్యాఖ్యానించారు. వరంగల్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడితే టీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని భావించవచ్చన్నారు. తాను మాదిగ కులంలో ఉపకులంగా ఉన్న బైండ్ల కులానికి చెందినవాడినని ఆయన చెప్పారు.

కెసిఆర్‌కు జానారెడ్డి కౌంటర్

నిన్న వరంగల్ సభలో కెసిఆర్ చెప్పినవన్నీ అబద్దాలు అని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి మండిపడ్డారు. మంత్రి పదవి కోసం తాను తెలంగాణ ఫోరం పెట్టానని చెప్పడం సరికాదన్నారు. ఇతరుల స్థాయి తగ్గించేలా మాట్లాడొద్దన్నారు. తెలంగాణ కోసం తాము ఎంతో కృషి చేశామని, సోనియాను ఒప్పించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+