వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? చోరీల నియంత్రణా చిట్కాలు చెప్పి; దొంగలతో జర భద్రం అంటున్న పోలీసులు!!

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. చాలామంది తమ స్వస్థలాలకు సంబరాలు జరుపుకోవడానికి బయలుదేరుతారు.ఇప్పటికే సంక్రాంతి పండుగ కోసం తెలంగాణా నుండి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో దాదాపుగా చాలా కాలనీలు, అపార్టుమెంట్లు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్మానుష్యంగా కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఏపీ వాసులు అత్యంత ఇష్టంగా జరుపుకొనే సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు ఏపీ వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇక ఈ సమయంలో సంక్రాంతికి ఊరు వెళ్తున్న వారికి దొంగల బెడద నుంచి కాపాడుకోవడానికి ఎన్నో సూచనలు ఇస్తున్నారు తెలంగాణ పోలీసులు.

సంక్రాంతికి దొంగల బెడద .. చోరీల నియంత్రణకు పోలీసుల సలహాలు

సంక్రాంతికి దొంగల బెడద .. చోరీల నియంత్రణకు పోలీసుల సలహాలు


సంక్రాంతికి ఊరెళ్తున్నారా... అయితే జరభద్రం అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు తెలంగాణా పోలీసులు . సంక్రాంతి పండుగకు పిల్లలకు సెలవులుండటంతో పాటుగా, బంధుమిత్రులతో సంతోషంగా గడపడం కోసం చాలా మంది సొంత ఊర్లకు పయనమై వెళ్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ దృష్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్తున్న పోలీసులు ఊరు వెళ్తున్న వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దొంగల బారి నుండి ఇళ్లను కాపాడుకోవచ్చని చెప్తున్నారు.

బంగారం లాకర్లలో పెట్టుకోండి .. లేదా విలువైన వాటిని వెంట తీసుకెళ్ళండి

బంగారం లాకర్లలో పెట్టుకోండి .. లేదా విలువైన వాటిని వెంట తీసుకెళ్ళండి

సంక్రాంతి పండుగ సమయంలో దొంగల బారి నుండి కాపాడటానికి రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న పోలీసులు చిన్నచిన్న చిట్కాలను, సమయస్ఫూర్తిని పాటిస్తే దొంగల బెడద నుండి కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం అని సూచిస్తున్నారు. అలా వీలు కాకుంటే ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకు వెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఊరు వెళ్తున్నప్పుడు నమ్మకస్తులైన పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే తమకు కాల్ చేయాలని చెప్పాలనిసూచిస్తున్నారు.

 వాహనాలు ఇంట్లోనే పార్క్ చేసుకోండి. హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ చెయ్యండి

వాహనాలు ఇంట్లోనే పార్క్ చేసుకోండి. హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ చెయ్యండి

విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారు డిక్కీలలో పెట్టడం చేయరాదని,వాహనాలను బయట పార్కింగ్ చేయకూడదని, ఇంటి గేటు లోపల పార్కింగ్ చేయాలని, అంతేకాదు వాహనాలకు హ్యాండిల్ లాక్ లాక్ మాత్రమే కాకుండా, వీల్ లాక్ కూడా చేయాలని సూచిస్తున్నారు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదని, తమతోపాటే తీసుకెళ్లాలని చెప్తున్నారు. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలని సూచిస్తున్నారు. అలా చేస్తే ఇంట్లో మనుషులు ఉన్నట్టుగా ఉంటుందని చెప్తున్నారు.

ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం, లైట్ వేసి ఉంచండి

ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం, లైట్ వేసి ఉంచండి

పని మనుషులు ఉంటే రోజూ ఇంటి ముందు శుభ్రం చేయమని చెప్పాలని పోలీసులు చెప్తున్నారు. వీలైతే ప్రతిరోజూ రాత్రి తెలిసిన వారిని ఎవరైనా ఇంట్లో పడుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని చెప్తున్నారు. ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం అని సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు అన్నీ సరిగా వేసింది లేనిదీ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

 సీసీ కెమెరాలు ఏర్పాటు మంచిది, పేపర్, పాల వాళ్ళ విషయంలోఇలా చెయ్యండి

సీసీ కెమెరాలు ఏర్పాటు మంచిది, పేపర్, పాల వాళ్ళ విషయంలోఇలా చెయ్యండి

వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెప్తున్నారు. ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సిసి కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్ లో ప్రత్యక్షంగా చూసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చు అని సూచిస్తున్నారు. ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలని, వారు రావడం వల్ల పాల ప్యాకెట్లు, పేపర్లు తీయకుంటే ఇంట్లో ఎవరూ లేరని దొంగలు ఇట్టే పసిగట్టవచ్చునని అంటున్నారు. అందుకే పేపర్ బాయ్ ని, పాల వాళ్లను రావద్దని చెప్పాలని సూచిస్తున్నారు

పోలీసులకు, నమ్మకస్తులైన పక్కింటి వారికి సమాచారం ఇవ్వండి

పోలీసులకు, నమ్మకస్తులైన పక్కింటి వారికి సమాచారం ఇవ్వండి


ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంతో వ్యవహరిస్తే దొంగతనాలని నియంత్రించడం చాలా సులభం అని పోలీసులు వెల్లడిస్తున్నారు. మీ కాలనీలలో ఎవరైనాఅనుమానిత వ్యక్తుల కదలికలను గమనించినా , పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని చెబుతున్నారు.

అనుమానం ఉంటే 100 కు డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి

అనుమానం ఉంటే 100 కు డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి

అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా ఆయన సమీప పోలీస్ స్టేషన్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఈ మాత్రం జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో దొంగలు పడకుండా నియంత్రించవచ్చని, చోరీలను కట్టడి చేయడానికి ప్రజల సహకారం కూడా ఉండాలని తెలంగాణ పోలీసులు రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరు వెళ్తున్న వారు ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చోరీల బారినుండి కాపాడుకోవచ్చని చెప్తున్నారు.

English summary
people are going to their villages to celebrate the Sankranti festival. However, the Telangana police say some tips to protect the houses from thieves. police are alerting people at festive times from thefts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X