వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాకు వానగండం.. మరో రెండురోజులు రెడ్ అలెర్ట్; ఈ జిల్లాలలోనే భారీవర్షాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల ఇళ్లల్లో నుంచి కాలు బయట పెట్టడానికి భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల రహదారుల మీద వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.

ఉత్తర తెలంగాణా జిల్లాలలో వర్ష బీభత్సం

ఉత్తర తెలంగాణా జిల్లాలలో వర్ష బీభత్సం

జోరువానలో తెలంగాణ రాష్ట్రం మొత్తం తడిసి ముద్దవుతుంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి . ఉత్తర తెలంగాణాలో కురుస్తున్న వర్షాలతో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసిన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మంగళవారం కూడా కుండపోతగా వర్షాలు కురిశాయి. జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం కురిసింది. 118 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. 88 ప్రాంతాలలో అతి భారీ వర్షం కురవగా,371 ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరో రెండు రోజులు ఇదే పరిస్థితి.. ఈ జిల్లాలకే వానగండం .. వెల్లడించిన వాతావరణ శాఖ

మంగళవారం 19 ప్రాంతాలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల్‌, ఆసిఫాబాద్‌ మంచిర్యాల, కరీంనగర్‌, కామారెడ్డి, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.

నేడు భారీ వర్షాలకు ఛాన్స్.. నిన్న అత్యధికంగా వర్షపాతం ఇక్కడే

నేడు భారీ వర్షాలకు ఛాన్స్.. నిన్న అత్యధికంగా వర్షపాతం ఇక్కడే


భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేసింది. హైదరాబాద్‌లో మంగళవారం కూడా 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అదే రోజు అత్యధికంగా ఆదిలాబాద్ 98 మి.మీ, హకీంపేట 47 మి.మీ, బద్రాచలం 36 మి.మీ, రామగుండం 34 మి.మీల అత్యధిక వర్షాలు నమోదయ్యాయి.మహబూబాబాద్, జనగాం, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ రెడ్ వార్నింగ్ జారీ చేసింది.

గోదావరి బేసిన్ లో ప్రాజెక్ట్ లకు జల కళ

గోదావరి బేసిన్ లో ప్రాజెక్ట్ లకు జల కళ

ఇదిలా ఉంటే గోదావరి బేసిన్‌లో దాదాపు రిజర్వాయర్లు నిండిపోయాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. భారీ వర్షాల కారణంగా గోదావరి బేసిన్‌లోని అన్ని రిజర్వాయర్లు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

శ్రీరాం సాగర్, కొమురం భీమ్ ప్రాజెక్ట్, కాళేశ్వరం గేట్లు ఎత్తివేత

శ్రీరాం సాగర్, కొమురం భీమ్ ప్రాజెక్ట్, కాళేశ్వరం గేట్లు ఎత్తివేత

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 74.83 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల (టీఎంసీ) నీటి మట్టం చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 81,730 క్యూసెక్కులు ఉండగా, అధికారులు తొమ్మిది గేట్లను తెరిచి 86,118 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్‌ జిల్లాలోని కొమరం భీమ్‌ ప్రాజెక్టు గేట్లను తెరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగట్ట, సరస్వతి, పార్వతి బ్యారేజీలకు కూడా ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. నీటిని విడుదల చేసేందుకు అధికారులు గేట్లు తెరిచారు.

English summary
Heavy rains in Telangana. The Meteorological Department warns that there is a chance of moderate to heavy rains in 12 districts today. It said that the situation will be the same for the next two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X