పట్టాల దుస్థితి ఇలా?: కనీసం ఇంకో రెండురోజులు?

Heavy rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. పల్లెలు, పట్టణాలు ఏకం అయ్యాయి. చెరువులు, కుంటలు ఎక్కడికక్కడె తెగిపోయాయి. వరదనీరు జనావాసాల్లోకి పోటెత్తింది.

ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నేడు కూడా అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

Telangana rains SCR GM Arun Kumar Jain inspects damaged kesamudram railway track

దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలకూ భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

భారీ వర్షాల ధాటికి అనేక చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే పట్టాలపై వరద నీళ్లు ప్రవహించాయి. ట్రాక్ మొత్తం చాలావరకు ధ్వంసమైంది. పట్టాల కింద భూమి పలు చోట్ల కోతకు గురైంది.

జిల్లాలోని కేసముద్రం మండలం తాల్లపూసపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ఓవర్ హెడ్ లైన్లు దెబ్బతిన్నాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. ఫలితంగా- ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌ సహా పలు రైళ్లను మహబూబాబాద్‌లో నిలిపివేశారు.

Telangana rains SCR GM Arun Kumar Jain inspects damaged kesamudram railway track

అత్యంత రద్దీ మార్గం కావడం వల్ల దీన్ని పునరుద్ధరించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. ట్రాక్ పునర్నిర్మాణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తోన్నారు. మట్టి కోసుకుపోయిన చోట బౌల్డర్లు, సిమెంట్ బెడ్స్‌ను వేస్తోన్నారు. ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాల తీగలను సరిచేస్తోన్నారు.

ఈ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్వయంగా పర్యవేక్షించారు. 418, 432 కిలోమీటర్ వద్ద పట్టాలు బాగా దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతు పనులు పూర్తి చేస్తోన్నామని వివరించారు. ఈ మార్గంలో మొత్తం అయిదు చోట్ల పట్టాలు ధ్వంసం అయినట్లు గుర్తించామని అన్నారు. నాలుగుచోట్ల పునరుద్ధరణ పనులు ముగిశాయని తెలిపారు.

ఇదే మార్గంలో మరికొన్ని చోట్ల పట్టాలపై వరదనీరు ప్రవహించిందని, ఫలితంగా అక్కడ మట్టి కోతకు గురైందని జీఎం తెలిపారు. పట్టాలపై నిలిచిన నీరు దిగువకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంగళవారం సాయంత్రానికి పునరుద్ధరణ పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+